వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామసూత్ర వ్యాఖ్యల దుమారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Suneet Varma
కామసూత్రపై ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సునీత్ వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రపంచంలో హిందు గ్రంథాల్లో కామసూత్ర అతి గొప్పదని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సునీత్ వర్మ ఆ వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యపై హిందువులు మండిపడుతున్నారు. అమెరికాలోని నేవాడకు చెందిన రాజన్ జెడ్ సునీత్ వర్మ వ్యాఖ్యపై తీవ్రంగా మండిపడ్డారు. వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం (భగవద్గీతతో కలిపి), రామాయణం వంటి ప్రసిద్ధ గ్రంథాలు ఉండగా సునీత్ వర్మ కామసూత్రకు వాటికి మించిన స్థాయిని కల్పించడం తగదని ఆయన అన్నారు. సునీత్ వర్మ బహిరంగ క్షమాపణ చెప్పాలని యూనివర్శల్ సొసైటీ ఆఫ్ హిందూయిజం అధ్యక్షుడు జెడ్ డిమాండ్ చేశారు.

వాణిజ్య ఎజెండా కోసం సునీత్ వర్మ తప్పు వ్యాఖ్యతో హిందుత్వంపై తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సునీత్ వర్మ ప్రకటన భక్తుల మనోభావాలను దెబ్బ తీసిందని ఆయన అన్నారు. హిందుత్వం అతి ప్రాచీనమైందని, ప్రపంచంలోని అతి పెద్ద మతాల్లో మూడో స్థానంలో ఉందని, సంపన్నమైన తాత్విక చింతన కలిగిందని ఆయన అన్నారు. కామసూత్ర గ్రంథాన్ని వాత్సాయనుడు రాశాడు. ఇందులో కామానికి సంబంధించిన కళ, పద్ధతులు, వైజ్ఝానిక అంశాలున్నాయి. సునీత్ వర్మకు ఫ్యాషన్ డిజైనర్‌గా పెద్ద పేరుంది.

English summary
The Hindus are upset at India’s famous fashion designer Suneet Varma for reportedly calling Kamasutra the most celebrated Hindu text in the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X