సూరికి భాను ఎలా దగ్గరయ్యాడు?

Bhanu Kiran
భాను కిరణ్ అలియాస్ భాను గురించి అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు నా తమ్ముడి నుంచి నాకు ప్రమాదం ఎందుకు ఉంటుంది అని మద్దెలచెర్వు సూరి అనేవాడట. సూరి భానును తన తమ్ముడిలా చూసుకున్నాడని సూరి బంధువులు అంటున్నారు. భానును సూరి తన ప్రాణంగా చూసుకునేవాడట. అయితే, భాను కిరణ్‌ది చాలా విచిత్రమైన ప్రయాణం. భాను స్వస్థలం కడప జిల్లా కొండాపురం మండలం పొట్టిపాడు గ్రామం. తన కుటుంబంతో భాను అనంతపురంలోని సాయినగర్‌లో ఎక్కువ కాలం నివాసం ఉన్నాడు. ఆ తర్వాత కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మారాడు. అతనికి హైదరాబాదులోని చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో ఓ రిసార్టు ఉన్నట్లు సమాచారం. సూరితో సాన్నిహిత్యం పెరిగిన తర్వాతనే అతను హైదరాబాదుకు మారాడు. సూరి వ్యవహారాలన్నీ అతనే చూస్తూ ఉంటాడు.

కాగా, భాను తండ్రి చాలా కాలం క్రితమే మరణించాడు. తల్లి ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయింది. భాను సోదరి దంపతులు అమెరికాలో సెటిలయ్యారు. వారు అమెరికా వెళ్లిపోయిన తర్వాత భాను హైదరాబాదు చేరుకున్నాడు. భాను కిరణ్‌, పవన్ కలిసి ఇంటర్మీడియట్ చదువుకున్నారు. సూరి అనుచరుడైన పవన్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ కారు బాంబు కేసులో నిందితుడు. పవన్ ద్వారానే భాను సూరికి పరిచయమైనట్లు తెలుస్తోంది. అలా పరిచయమైన తర్వాత జైల్లో ఉన్న సూరిని ఎక్కువ సార్లు కలిసింది కూడా భానునే కావడం విశేషం.

హైదరాబాదు మారిన తర్వాత భాను కూడా సెటిల్మెంట్లు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సెటిల్మెంట్ వ్యవహారంలో సికింద్రాబాదు రాంగోపాల్‌పేట పోలీసులు 2002లో భానును అరెస్టు చేశారు. కాగా, 2008లో మరోసారి భాను అరెస్టయ్యాడు. ఓ వ్యాపారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేసిన కేసులో భానును హైదరాబాదులోని సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 2009లో ఆయుధాల అక్రమ రవాణా కేసులో హైదరాబాదు టాస్క్ ‌ఫోర్స్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. బీహార్, జార్ఖండ్ ‌ల నుంచి ఆయుధాలు తీసుకుని వచ్చి విక్రయించేవాడని ఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నుంచి అతను 2008లో ఆయుధానికి లైసెన్స్ పొందాడు. అయితే, ఆ తర్వాత అతని లైసెన్స్ రద్దయినట్లు సమాచారం. అయితే, మరొకరి పేరుతో గన్ లైసెన్స్ ‌ను రెన్యువల్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+