వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెర్రీపై బాలయ్య వ్యాఖ్యలకు మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారనే విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నందమూరి హీరోకే అండగా నిలిచినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో మంచి దర్శకులు లేరన్న అంశంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అంతకుముందు చెర్రీ తెలుగులో మంచి దర్శకులు లేరని చెప్పినందుకే బాలయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపించాయి. అయితే బాలయ్య ఎవరిని ఉద్దేశించి అన్నప్పటికీ ఆయన వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీ మద్దతు పలుకుతోంది.

బాలయ్య దర్శకుల అంశం ఏ సందర్భంలో అన్నారో తనకు తెలియదని అయినప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమేనని ప్రముఖ నటుడు మురళీ మోహన్ అన్నారు. ఆయన మాట్లాడిన మాటలు సరిగానే ఉన్నాయన్నారు. అందరికీ భావస్వాతంత్రం ఉంటుందని అయితే మన దర్శకులను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగులో మంచి దర్శకులు లేరనేది ఒక అనారోగ్యకరమైన, అప్రస్తుతమైన, అనవసరమైన చర్చ అని ప్రముఖ నటుడు, దర్శకుడు ఏవిఎస్ అన్నారు. తెలుగులో మంచి దర్శకులు లేరని ఎవరైనా అన్నారో లేదో తనకు తెలియదని ఒకవేళ అలా అని ఉంటే మాత్రం అది తప్పేనన్నారు.

అన్నవారు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, తెలుగులో మంచి మంచి దర్శకులు ఉన్నారన్న బాలయ్య వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు. బాలయ్య వ్యాఖ్యలను నిర్మాతలు కూడా సమర్థించారు. తెలుగు దర్శకులను కించపర్చడం సరికాదని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. దర్శకులను కించపర్చవద్దని హితవు పలికారు. బాలయ్య వ్యాఖ్యలను నిర్మాతలు, దర్శకులు, హీరోలు అని లేకుండా పరిశ్రమలోని అందరూ సమర్థిస్తున్నారు. అంతెందుకు చిరంజీవి కూడా బాలయ్య వ్యాఖ్యలను సమర్థించారు. కాగా గురువారం బాలయ్య తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

English summary
Telugu Cinema Industry supported Nandamuri Balakrishna comments. Actor Murali Mohan, actor and director AVS, producer Natti Kumar supported Balayya statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X