ఇక భానుకిరణ్ చిక్కినట్టేనా?

దీంతో పోలీసులు అజ్ఞాతంలో ఉన్న భానుకు డబ్బులు అందకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. భానుకు ఎవరెవరు డబ్బులు పంపిస్తున్నారు? ఎక్కడి నుండి పంపిస్తున్నారు? తదితర అంశాలపైన పోలీసులు దృష్టి సారించడంతో భానును ఆర్థికంగా ఆదుకునే వారు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. దీంతో భాను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మద్దెలచెర్వు సూరికి సంబంధించిన వారు సైతం భాను కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. మన్మోహన్, భానుతో పరిచయం ఉన్న సినీ నిర్మాతలు ఒక్కరొక్కరు పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇటు పోలీసులు ఆర్థికంగా తనను దెబ్బతీయడం, అటు మద్దెలచెర్వు సూరికి సంబంధించిన వారు వెతకడంతో పాటు పలువురు పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో అవుతున్న నేపథ్యంలో భాను లొంగిపోక తప్పదని పలువురు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications