కాంగ్రెసుతో కెసిఆర్ కుమ్మక్కు?

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్లడంపై ప్రత్యర్థులు తీవ్రంగా దాడి చేస్తున్నారు. సకల జనుల సమ్మె తీవ్రంగా జరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో కెసిఆర్ ఢిల్లీకి వెళ్లడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెసు పెద్దలతో కుమ్మక్కు కావడానికే ఆయన ఢిల్లీ వెళ్లారని విమర్శిస్తున్నారు. కెసిఆర్‌పై ఈ కోణంలో తెలుగుదేశం పార్టీ తీవ్రమైన దాడి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే వెళ్లడం వేరు, కెసిఆర్ తనంత తానుగా వెళ్లడం వేరు అని వారంటున్నారు. కెసిఆర్ తనంత తానుగా ఢిల్లీకి వెళ్లి తప్పు చేశారనే వారు కూడా ఉన్నారు.

కెసిఆర్ కాంగ్రెసు పెద్దలతో కుమ్మక్కయి తెలంగాణ రాకుండా చేస్తున్నారని ఆడిపోసుకుంటున్నారు. 2014వరకు తెలంగాణ రాకూడదని, ఈలోగా తమ పార్టీని దెబ్బ తీయాలని కెసిఆర్ చూస్తున్నారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుకు, కెసిఆర్‌కు మధ్య రహస్య అవగాహన ఉందనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కన్నా వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవాలనే దృష్టితోనే కెసిఆర్ పనిచేస్తున్నారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను తన పార్టీలో చేర్చుకోవడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. సాధ్యమైతే కాంగ్రెసు పార్టీ నాయకులను కూడా పార్టీలోకి వచ్చేలా చేయాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అనుసరిస్తున్న వైఖరినే తెలంగాణలో కెసిఆర్ ఆనుసరిస్తున్నారని అంటున్నారు. తమ పార్టీని దెబ్బ తీయడమే జగన్, కెసిఆర్ ప్రయత్నమని, వారిద్దరు కూడా కాంగ్రెసుతో కుమ్మక్కయి పని చేస్తున్నారని కూడా అనేవారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+