వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారా లోకేష్‌కు తొందర ఎందుకు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
రాజకీయాల్లోకి వచ్చి పార్టీపై పట్టు సాధించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ తొందర పడుతున్నారనే మాట వినిపిస్తోంది. ఆలస్యం అమృతం విషం అనుకుని ఆయన తొందరపడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యం చేస్తే చేయి దాటిపోయి నందమూరి కుటుంబ సభ్యులు ఆధిపత్యంలోకి వస్తారని ఆయన భయపడుతున్నారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభా నియోజకవర్గం నేతలు లోకష్‌ను తమ ఇంచార్జీగా ప్రకటిస్తూ తీర్మానం చేయాల్సిందేనని పార్టీ జిల్లా నాయకత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు మహదేవనాయుడు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వారు వినడం లేదు.

చంద్రబాబుతో విడిగా మాట్లాడుదామని, సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని వదిలేద్దామని, నారా లోకేష్‌కు చంద్రగిరి బాధ్యతలు అప్పగించాలనే తీర్మానం ప్రతిపాదిస్తే అనవసరమైన వివాదం చెలరేగుతుందని, చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత అవసరమైతే ప్రతిపాదిద్దామని చెప్పినా వారు వినడం లేదు. జిల్లా సర్వసభ్య సమావేశంలో ప్రతిపాదించి మహానాడులో ప్రవేశపెట్టాల్సిందేనని వారంటున్నారు. నారా లోకేష్ నుంచి ఒత్తిడి లేకపోతే చంద్రగిరి నాయకులు అంతగా పట్టు బట్టరనేది నిజం. నారా లోకేష్ తొందరపడుతూ చంద్రగిరి నియోజకవర్గం నాయకులతో ఒత్తిడి పెట్టిస్తున్నట్లు చెబుతున్నారు.

చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జీగా రంగ ప్రవేశం చేసినా జిల్లా రాజకీయాలపై, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలపై ఆధిపత్యం సంపాదించడానికి వీలవుతుందని నారా లోకేష్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మహానాడులో అది జరగకపోతే విషయం వెనక్కి పోతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఇరకాటంలో పెట్టే పనికే కాకుండా తన తండ్రి చంద్రబాబుకు ఆయనను దూరం చేసే పనికి కూడా నారా లోకేష్ తెర తీసినట్లు సమాచారం. ఏమైనా, తన రాజకీయ రంగ ప్రవేశానికి నారా లోకేష్ నుంచే తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
It is learnt that Nara Lokesh is instructing Chandragiri leaders to promote his leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X