వైయస్ వివేకాను జగన్ నమ్మడం లేదా?

వైయస్ వివేకానంద రెడ్డి వైయస్సార్ కాంగ్రెసులో వదని వైయస్ విజయమ్మకు తోడుగా నిలబడడానికి సిద్దపడినప్పటికీ వైయస్ జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. వచ్చినందుకు వైయస్ జగన్ సంతోషించడం గానీ కృతజ్ఞతలు తెలపడం గానీ చేయలేదని అంటన్నారు. అసలు వైయస్ వివేకానంద రెడ్డిని పట్టించుకోకుండానే వైయస్ జగన్ అన్ని పనులూ చేసుకుని పోతున్నారని చెబుతున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు కూడా ఆయన తగిన గౌరవమర్యాదలు ఇవ్వడం లేదని అంటున్నారు.
వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి మంత్రి పదవి తీసుకుని తనకు వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధపడడంపై వైయస్ జగన్ ఇంకా ఆగ్రహంగానే ఉన్నారని చెబుతున్నారు. అందుకే, తనంత తాను బాబాయ్ వచ్చినా అబ్బాయ్ ఖాతరు చేయడం లేదని అంటన్నారు. అందుకే వైయస్ వివేకానంద రెడ్డి పాతగూటికి చేరినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications