రాజీనామా యోచనలో జెపి

అయితే రాజీనామా కాకుండా దాడికి నిరాహార దీక్ష చేసే మరో యోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన సహచరులు, లోక్‌సత్తా నేతలు ఆయనను వారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే జయప్రకాశ్ నారాయణపై దాడిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఖండించారు. అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు అండగా నిలిచాయి. దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు నాగం జనార్దన్ రెడ్డి తదితరులు కూడా దాడిని వ్యతిరేకించారు.
కాగా, లోకసత్తా కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, జయప్రకాష్ నారాయణ ఒక మేధావిగా ముందుకు వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను తప్పు దోవ పట్టిస్తున్నారని తెరాస నాయకులకు చాలా కాలంగా వ్యతిరేకత ఉంది. తన ఆదర్శ నినాదాలతో సమైక్యాంధ్ర నినాదానికి ఆయన బలం చేకూరుస్తున్నారనే అభిప్రాయం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన వాదిస్తూ వస్తున్నారు. ఐఎఎస్ అధికారి అయిన జయప్రకాష్ నారాయణ తన పదవికి రాజీనామా చేసి లోకసత్తాను మొదట ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జివో)గా నడిపించారు. ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. గత ఎన్నికల్లో చాలా స్థానాల్లో లోకసత్తా పోటీ చేసినప్పటికీ జెపి ఒక్కరే హైదరాబాదులోని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.