కొండా రెడ్డి ఎపిసోడ్: దిమ్మ తిరిగిన జగన్

వైయస్ జగన్‌ను విచారించడానికి ముందు కొండారెడ్డిని తమ కార్యాలయానికి పిలిపించి పక్క గదిలో ఉంచారని, జగన్‌ను ప్రశ్నించే క్రమంలో కొండా రెడ్డి వ్యవహారంపై సిబిఐ అధికారులు దృష్టి పెట్టారని, కొండా రెడ్డి ఎవరో తెలియదని జగన్ చెప్పారని ఆ రెండు దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. కొండా రెడ్డి ఇక్కడే ఉన్నాడు - పిలిపించాలా, అతన్ని ఫేస్ చేస్తారా అని అడిగితే వద్దని జగన్ వేడుకున్నాడని వార్తలు వచ్చాయి. కొండా రెడ్డిని ఫేస్ చేయడానికి ఇష్టపడని జగన్ తనను వదిలేయాలని వేడుకున్నట్లు కూడా ఆ పత్రికలు రాశాయి. ఈ వార్త బయటకు రావడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో జగన్ వర్గం ఉన్నట్లు చెబుతున్నారు.
వివరాలన్నీ కొండా రెడ్డి కోర్టుకు వివరించారని, సిబిఐకి కూడా ఆ వివరాలు అందించారని అంటున్నారు. కొండా రెడ్డి కూడా అదే విషయాన్ని ఈనాడు దినపత్రికకు చెప్పాడు. మొత్తం మీద వైయస్ జగన్ తీవ్రమైన చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నారు. దీన్ని ఆయన ఎలా కౌంటర్ చేస్తారనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications