జగన్‌ను వదిలేసి, కొండా సురేఖ తెలంగాణ పాట

తెలంగాణ రాజకీయ, విద్యార్థి జెఎసి ఇచ్చిన పిలువు మేరకే తాను శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆమె బొంకుతున్నారు. అదే సమయంలో ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై ధ్వజమెత్తారు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి జెఎసి, రాజకీయ జెఎసి కార్యకర్తల మనసును దోచుకోవడానికి ఆమె తెలంగాణ ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. తన కార్యకర్తలను ఎన్ని బాధలకైనా ఓర్చి కాపాడుకుంటానని ఆమె నమ్మబలుకుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి లేని మంత్రివర్గంలో ఉండబోనని చెప్పి, ఆ మాటకు కట్టుబడి రాజీనామా చేశానని ఆమె చెప్పుకున్నారు. ఆమె భర్త, ఎమ్మెల్సీ కూడా అదే పాట పాడుతున్నారు.
కొండా సురేఖ వైయస్ జగన్‌కు అత్యంత నమ్మకమైన శాసనసభ్యురాలనే విషయం అందరికీ తెలిసిందే. వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోవడంతో ఆమె జగన్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా తెలంగాణ గురించే మాట్లాడుతున్నారు. తాను తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నానని, వైయస్ జగన్ రాజకీయాలకు కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో తిరిగి గెలిచేందుకే ఆమె ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications