బీరా, మేమా?:రష్యా అమ్మాయిల అర్ధనగ్న ప్రదర్శన

Medvedev Girls
మాస్కో: రష్యాలో బీరుకు వ్యతిరేకంగా పలువురు యువతులు బట్టలు విప్పుతూ తమ నిరసనలను తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో బీరు తాగే యువత తీరును నిరసిస్తూ, అధ్యక్షుడు మెద్వేదేవ్‌కు మద్దతుగా వారు గురువారం మాస్కోలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో యువతులు తమ పక్కన బీరు బకెట్లు ఉంచుకొని దుస్తులు విప్పుతూ బీరు కావాలా? మేమా? తేల్చుకోవాలని ప్రశ్నించారు. బహిరంగంగా బీరు తాగడాన్ని తగ్గించడంలో భాగంగా యువతులు అర్థ నగ్న ప్రదర్శన చేశారు.

కాగా ఇటీవల బీరును మద్యంగా వర్గీకరించే బిల్లుపై రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్ జూలైలో సంతకం చేశారు. బీరు వ్యసనాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఆయన బిల్లుపై సంతకం చేశారు. పది శాతం కంటే తక్కువ ఆల్కహాల్ ఉన్న బీరును గతంలో ఆహార పదార్థంగా పరిగణించేవారు. అయితే వచ్చే 2012 మార్చి 4న జరిగే ఎన్నికలలో మెద్వెదేవ్‌ను సపోర్టు చేయడమే లక్ష్యంగా యువతులు ప్రదర్శించినట్లుగా పలువురు భావిస్తున్నారు. వారిని వారు తమను మెద్వెదేవ్ గరళ్స్‌గా పిలవాలని వీక్షకులకు సూచించారు. తాము మెద్వెదేవ్ కోసం ఏమైనా చేస్తామని చెప్పారంట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+