పవన్ కళ్యాణ్ పై విమర్శలకు దారితీస్తున్న డైరెక్టర్స్..!

అలాగే 'బంగారం"తో ధరణి కూడా నిరాశపరిచాడు. అయినా మరోసారి ఇంకో తమిళ స్టార్ డైరెక్టర్ విష్ణువర్థన్ కి అవకాశమిచ్చిన పవన్ త్వరలో డ్యాన్స్ మాస్టర్ రాజుసుందరంకీ సినిమా చేస్తాననడం, అందులోనూ ఆ చిత్రం ఎస్ జె సూర్య కథతో రూపొందనుండడం విమర్శకుల వాదనకు ఇంకాస్త బలాన్ని చేకూర్చింది. అన్నట్టు, ఈ తమిళ దర్శకులూ, అరవ కథల సంగతి ఇలా వుంటే అరువు కథత హరీష్ శంకర్ చేయాల్సిన 'గబ్బర్ సింగ్" అటకెక్కిందనే వ్యాఖ్యలూ వినవస్తుండడం గమనార్హం..!
ప్రస్తుతం కోల్ కతాలో 'కాళీ' చిత్రం షూటింగులో బిజీగా వున్న పవన్ కల్యాణ్, దీని తర్వాత 'గబ్బర్ సింగ్' సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. 'మిరపకాయ్' చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి చేశారు. హిందీ చిత్రం 'దబాంగ్' రీమేక్ గా దీనిని నిర్మిస్తున్నప్పటికీ తెలుగు నేటివిటీకి, పవన్ కల్యాణ్ ఇమేజ్ కీ అనుగుణంగా కథను పూర్తిగా మార్చినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications