అన్నయ్య రాజకీయాలతో పవన్ కలత

గత ఎన్నికల్లో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ చిరంజీవి కోసం పెద్ద యెత్తున ప్రచారం సాగించారు. ఇతర పార్టీలపై తీవ్రమైన వ్యాఖ్యలతో ఆయన ముందుకు దూసుకెళ్లారు. కాంగ్రెసు నాయకులను పంచెలూడదీసి కొట్టాలని ఆయన ఎన్నికల్లో పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యనే ఇప్పుడు వివాదంగా మారింది. అలాంటి వ్యాఖ్యలున చేసిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులోకి ఎలా అహ్వానిస్తారని కాంగ్రెసులోని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యను వారు గుర్తు చేస్తున్నారు. అంత తీవ్రంగా ముందుకు నడిచిన పవన్ కళ్యాణ్‌ను ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాలు తీవ్ర నిస్సత్తువకు గురి చేసినట్లు చెబుతారు.
పార్టీ వ్యవహారాల్లో చిరంజీవి బావ మరిది, నిర్మాత అల్లు అరవింద్ ప్రాబల్యం పెరుగుతూ పోయింది. దాంతో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు పట్ల మెతక వైఖరి అవలంబిస్తూ వచ్చింది. ఈ క్రమంలో అది ఇష్టపడని పవన్ కళ్యాణ్ పార్టీకి దూరమయ్యారని అంటారు. ఆ తర్వాత క్రమంగా కాంగ్రెసు పార్టీకి సన్నిహితమవుతూ విలీనం దాకా వచ్చింది. ఈ పరిణామాలేవీ పవన్ కళ్యాణ్‌కు నచ్చడం లేదని చెబుతున్నారు. ఈ స్థితిలో ఆయనకు రాజకీయాలపై విసుగు, వైరాగ్యం వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, తన వైముఖ్యాన్ని, వైరాగ్యాన్ని బహిరంగంగా వ్యక్తం చేయడానికి ఆయన ఏ మాత్రం ఇష్టపడడం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications