సోనియా అవుట్, రాహుల్ ఇన్

రాహుల్ గాంధీ కన్నా చిన్న వయస్సులో ఆయన తండ్రి రాజీవ్ గాంధీ ప్రధాని, పార్టీ చీఫ్ అయ్యారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి 41 ఏళ్లు. రాహుల్ పార్టీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రభుత్వ నాయకత్వంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు. సోనియా గాంధీ పార్టీ అధినేత గత ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. వెనక ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. రాజీవ్ గాంధీ సానుభూతి వెల్లువలో పార్టీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చారు. అంతేకాకుండా, ఆ తర్వాతి ఏడాది జరిగిన వివిధ రాష్ట్రాల శానససభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది. తన తండ్రి మాదిరిగా కాకుండా ప్రభుత్వం తీవ్రమైన, క్లిష్టమైన సమస్యలను ఎదుర్కుంటున్న సమయంలో రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. సమస్యల పరిష్కారం ఆయనకు సవాల్ అవుతుందనడంలో సందేహం లేదు.
సోనియా గాంధీ అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి నుంచి రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారనే ప్రచారం జరుగుతోంది. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏమైనా, రాహుల్ గాంధీ పార్టీని, ప్రభుత్వాన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తారా, ఆయన వద్ద ఉన్న మంత్రదండమేమిటనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications