సీమాంధ్ర: జగన్ వర్సెస్ లగడపాటి

YS Jagan-Lagadapati Rajagopal
సీమాంధ్రలో ఆధిపత్యానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పోటీ పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ప్రకటన కూడా ఆ విషయాన్ని పట్టిస్తోంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని వైయస్ జగన్మోహన్ రెడ్డిని సమైక్యవాదిగానే భావించడానికి కూడా ఆ ప్రకటన బలం చేకూరుస్తోంది. సమైక్యావాదిగా జగన్ సీమాంధ్ర బలమైన శక్తిగా ఎదుగుతారనే అభిప్రాయం ఉంది. సమైక్యవాదాన్ని బలంగా సమర్థించిన చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో ఆ ఖాళీని జగన్ భర్తీ చేసే అవకాశాలున్నాయి.

జగన్ సీమాంధ్రలో మరింత బలపడుతారనే ఉద్దేశంతోనే లగడపాటి రాజగోపాల్ తన గొంతును పెంచినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్‌ను తానే ధీటుగా ఢీకొట్టగలననే సంకేతాలను ఆయన పార్టీ అధిష్టానానికి అందించినట్లు ప్రచారం జరుగుతోంది. సమైక్యాంధ్రకు గట్టి మద్దతు ప్రకటించి, సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకుడిగా ముద్ర పడిన లగడపాటి రాజగోపాల్ తెలంగాణ విషయంలో మెతకబడినట్లు కనిపిస్తున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల డిమాండ్లు రాకపోతే తెలంగాణపై తనకు అభ్యంతరం లేదని చెప్పారు. దీన్ని ఆసరాగా చేసుకుని శ్రీకాంత్ రెడ్డి లగడపాటి ధ్వజమెత్తారు.

సీమాంధ్రకు తానే నాయకుడిని అన్నట్లుగా లగడపాటి భావిస్తున్నారని ఆయన అన్నారు. దానికితోడు, లగడపాటి సమైక్యాంధ్ర విషయంలో మెతకబడ్డారనే విషయాన్ని సీమాంధ్ర ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి, తద్వారా జగన్‌ను ఎదిరిస్తున్న లగడపాటికి మద్దతును తగ్గించడానికి శ్రీకాంత్ రెడ్డి ఆ ప్రకటన చేశారని అంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి ప్రకటన ద్వారా సమైక్యవాదుల్లో లగడపాటిపై వ్యతిరేకత మొదలవుతుందనే అభిప్రాయం కూడా ఉంది. దాన్నే మరింతగా పెంచాలనేది జగన్ వర్గం ఉద్దేశ్యంగా చెబుతున్నారు. మొత్తం మీద, సీమాంధ్రలో పోరు లగడపాటి వర్సెస్ జగన్‌గా మారవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+