తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదా?

Swarupananda Swamy
రాష్ట్రంలో ఏ తీవ్రమైన అంశం ముందుకు వచ్చినా తెలుగు టీవీ చానెళ్లు జ్యోతిష్యులను ముందుకు తేవడం పరిపాటిగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో చానెళ్లు వారిని ముందు పెట్టి అభిప్రాయాలు తెలుసుకున్నాయి. కాగా, శారదాపీఠం అధిపతి స్వరూపనందేంద్ర స్వామి మాత్రం తనంత తానుగా ముందుకు వచ్చి - తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్పదని ఇటీవల విశాఖపట్నంలో చెప్పారు. గ్రహాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. సెప్టెంబర్‌లోగా తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం జరిగిపోతుందని కూడా ఆయన తేల్చి చెప్పారు.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఏ శక్తులూ ఆపలేవని వరంగల్లు జిల్లాకు చెందిన శర్మ అనే జ్యోతిష్కుడు చెప్పారు. ఆయన అభిప్రాయం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుకు చెందిన టీ టీవీ చానెల్‌లో ప్రసారమైంది. సీమాంధ్రలో ఉద్యమాలు గానీ సీమాంధ్ర నాయకుల ఆటంకాలు గానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేవని ఆయన అన్నారు. సెప్టెంబర్‌లోగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో నిర్ణయం జరిగిపోతుందని కూడా ఆయన చెప్పారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జాతక చక్రాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధిస్తారని ఆయన అన్నారు.

మరో ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఇద్దరు, ముగ్గురు టీవీ చానెళ్ల అభిప్రాయాలను ప్రసారం చేసింది. జులై 12 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు రాష్ట్రంలోని ముఖ్య నాయకులకు గ్రహాలు అనుకూలంగా లేవని ఓ జ్యోతిష్కుడు చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతక చక్రం బాగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయనకు సెప్టెంబర్ 13వ తేదీలోగా పదవీ గండం తప్పదని చెప్పారు. కాగా, పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం సరైంది కాదని, అందువల్ల తిప్పలు తప్పవని మరో జ్యోతిష్కుడు అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 13వ తేదీ తర్వాత పరిస్థితులు చక్కబడుతాయని మరో జ్యోతిష్య పండితుడు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+