డిఎస్‌తో తెలంగాణ దూకుడుకు కళ్లెం

D Srinivas
తెలంగాణ అంశంపై దూకుడుగా వెళ్తున్న తెలంగాణ పార్టీ నాయకులకు కళ్లెం వేయడానికే పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌కు కాంగ్రెసు అధిష్టానం ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు గవర్న‌ర్‌గా వెళ్లిన రోశయ్య ఖాళీ చేసిన ఎమ్మెల్సీ సీటును డిఎస్‌కు కట్టబెట్టడంలోని ఆంతర్యం ఇదేనని అంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీని దెబ్బ కొట్టి, దాన్ని నిర్వీర్యం చేసే ఆలోచన డిఎస్ ఎంపిక వెనక ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు తెలంగాణపై దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తీవ్రమైన ప్రకటనలు కూడా చేస్తున్నారు. దీంతో స్టీరింగ్ కమిటీని చీల్చి, కేశవరావును కూడా దెబ్బ తీయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. డిఎస్‌కు పదవి కట్టబెడితే కాంగ్రెసు తెలంగాణ నేతల్లో చీలిక వస్తుందని కాంగ్రెసు ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు అధిష్టానం ఆలోచనకు అనుగుణంగానే తెలంగాణ కాంగ్రెసు నాయకులు చాలా మంది మళ్లీ డిఎస్ పక్కన చేరడానికి ఉవ్విళ్లూరుతున్నారు. డిఎస్ నామినేషన్ సందర్భంగా చేసిన హడావిడి కూడా ఆ విషయాన్ని పట్టిస్తోంది. పలువురు తెలంగాణ నాయకులు ఆయనను అభినందించడానికి పోటీ పడ్డారు. డిఎస్ ఎంపిక తెలంగాణకు అనుకూలంగా పనిచేస్తుందని మంత్రి సారయ్య అన్నారు. తీవ్రమైన ప్రకటనలు చేయకుండా, సంయమనంతో అధిష్టానం అప్పగించిన పనిని చేసుకుని వెళ్లే తత్వం డి. శ్రీనివాస్‌ది. అందువల్లనే తెలంగాణ ఆపరేషన్‌ను డిఎస్‌కు అప్పగించినట్లు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణలో డిఎస్‌కు స్థానం దక్కుతుందని అంటున్నారు. అలాగే శాసన మండలి సభా నాయకుడిగా కూడా డిఎస్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ స్థితిలో డిఎస్ చుట్టూ తెలంగాణ నాయకులు ర్యాలీ అవుతారని, దానివల్ల తెలంగాణ నాయకులను చల్లబరచవచ్చునని అధిష్టానం భావించినట్లు చెప్పవచ్చు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వల్ల ఆ పని సరిగా జరగడం లేదనే అభిప్రాయంతో డిఎస్ సేవలను వాడుకోవాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+