కళ్యాణ్ అస్తులు రూ. 500 కోట్లు?

కళ్యాణ్‌కు మొత్తం 55చోట్ల ఆస్తులున్నట్లు పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. పటాన్ చెర్వు, నానక్‌రాం గుడా, దిండిగల్ వంటి పలు ప్రాంతాల్లో విలువైన భూములున్నట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. కొన్ని చోట్ల భూములను డెవలప్‌మెంటు కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, కళ్యాణ్‌కు 60 బ్యాంక్ ఖాతాలున్నట్లు సమాచారం. ఈ ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారని తెలుస్తోంది. 2006లో తెలుగు సినీ రంగంలోకి రాయలసీమ ఫాక్షన్ ప్రవేశించిందని, అప్పటి నుంచి కళ్యాణ్ ఫాక్షన్‌కు దగ్గరయ్యాడని ప్రచారం జరుగుతోంది.
కళ్యాణ్‌తో పాటు మరో తెలుగు నిర్మాత శింగనమల రమేష్‌కు కూడా భాను కిరణ్‌తో సంబంధాలున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద టాలీవుడ్‌ను కొత్త రకం మాఫియా చుట్టుముట్టిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications