డ్రగ్ రాకెట్లో మరింత మంది సెలిబ్రిటీలు

Varun Sandesh
డ్రగ్ రాకెట్ వ్యవహారంలో తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. గత కొన్నాళ్లుగా డ్రగ్ రాకెట్‌లో ఇరుక్కున్న సినీ ప్రముఖుల పేర్లు ఒక్కొటొక్కటే బయటపడుతున్నాయి. ఫాక్షన్ మాఫియా, వ్యభిచారం వంటి సమస్యలతో పాటు డ్రగ్ రాకెట్ కూడా టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. మత్తుపదార్థాలకు సంపన్న కుటుంబాలకు చెందిన యువతీయువకులు కూడా అలవాటు పడినట్లు చెబుతున్నారు. ఇందులో ఐఎఎస్, ఐపియస్ అధికారుల పిల్లలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, టాలీవుడ్ సెలిబ్రిటీలు పట్టుబడినప్పుడే పెద్ద యెత్తున ప్రచారంలోకి వస్తోంది. సినిమా రంగానికి ఉన్న గ్లామర్ వల్ల ఇది జరుగుతోంది. హీరోలు, హీరోయిన్ల పట్ల ప్రజల్లో ఉండే ఇమేజ్ ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

కొకైన్‌తో పట్టుబడిన నాగ సిద్ధార్థ, ఫ్రెడ్రెక్ ఫోన్ కాల్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా సినీ పరిశ్రమలోని మరింత మందిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఓ ప్రముఖ నిర్మాత కుమారుడు, ఓ హీరోయిన్‌లతో పాటు మరింత మందికి కూడా వారిద్దరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు 2010 ఫిబ్రవరిలో 20 కిలోల ఎఫిడ్రైన్‌తో కెవి రావు అనే నిర్మాత పట్టుబడడంతో టాలీవుడ్ వైపు ప్రధానంగా దృష్టి మళ్లింది. ఆ తర్వాత హీరో రవితేజ సోదరులు రఘురాజు, భరత్ రాజు 2010 ఆగస్టులో ఓ వ్యాపారవేత్తతో పాటు నైజీరియన్ క్లెమెంట్ అలియాస్ విక్టర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరోయిన్, నిర్మాత జీవిత రాజశేఖర్ సోదరుడు మురళిని ఇతరులతో పాటు కొకైన్ కొనుగోలగు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఏడాది ఎప్రిల్ 1వ తేదీన ఫిల్మ్ నగర్‌లో సూడాన్‌కు చెందిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. దీన్నిబట్టి టాలీవుడ్‌కు పెద్ద యెత్తున మత్తుపదార్థాలు సరఫరా అవుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వరుణ్ సందేశ్, అభిషేక్‌లు కూడా డ్రగ్ రాకెట్లో చిక్కుకున్నారు. డాక్టర్ నాగ సిద్ధార్థను, నైజీరియన్ ఫ్రెడ్రెక్‌ను కొకైన్‌తో పోలీసులు అరెస్టు చేయడంతో మరోసారి కలకలం ప్రారంభమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+