హైదరాబాద్ గే క్లబ్ దుమారం

ఏడు నిమిషాల పాటు ప్రసారమైన ఆ వార్తాకథనంలో గే క్లబ్‌ల్లో రహస్య కెమెరాతో తీసిన ఫుటేజ్‌లను కూడా చానెల్ ప్రసారం చేసింది. వ్యక్తిగత విషయాల్లోకి చొరబడడమేనని, భారతదేశంలో దీని వల్ల తీవ్ర పరిణామాలుంటాయని, ఉద్యోగం పోవచ్చునని, కుటుంబంలో కలతలు చెలరేగవచ్చునని, అది మంచిది కాదని ప్రముఖ గే హక్కుల కార్యకర్త సునీల్ గుప్తా అభిప్రాయపడినట్లు ఓ ప్రముఖ చానెల్ తెలిపింది. ప్రకృతికి విరుద్ధమైన స్వలింగ సంపర్క కార్యకలాపాల్లో ఎక్కువ సాఫ్ట్‌వేర్ నిపుణులు, విద్యార్థులు, సంపన్న యువకులు మునిగితేలుతున్నారని టీవీ9 వార్తాకథనం వ్యాఖ్యానించింది.
టీవీ9 వార్తాకథనంలో ప్రసారమైన తన ఫొటోను తల్లిదండ్రులు చూస్తారనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి. తమ హక్కులకు భంగం కలిగించిన టీవీ9 క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గే హక్కల గ్రూపులు అంటున్నాయి.












Click it and Unblock the Notifications