బిగ్‌బిని మాయ అరెస్టు చేయిస్తారా?

Amitabh Bachchan
తన చిత్రం ఆరక్షణ్ సినిమా ప్రమోషన్ కోసం ఉత్తరప్రదేశ్‌లో అడుగు పెడితే అమితాబ్‌ను అరెస్టు చేయించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మాయావతి ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా తన ట్విట్టర్‌లో రాశారు. తమను నగరంలోకి అనుమతించకూడదని యుపి అధికారులకు ఆదేశాలున్నట్లు, ఈ విషయాన్ని పోలీసులు ప్రైవేట్‌గా చెబుతున్నారని ఆయన అన్నారు.

ఆరక్షణ్ ప్రమోషన్ వల్ల విద్యార్థుల్లో నిరసన పెల్లుబుకుతుందని మాయావతి ప్రభుత్వం చెబుతోంది. శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చుననే ఉద్దేశంతో లక్నో విశ్వవిద్యార్థులను ఆరక్షణ్ బృందం కలుసుకోకూడదని ఆదేశించింది.

కాగా, తన సినిమా రాజకీయాలకు సంబంధించింది కాదని, దేశంలోని ఉన్నత విద్య దుస్థితికి ఇది అద్దం పడుతుందని చిత్ర దర్శకుడు ప్రకాష్ ఝా అంటున్నారు. సినిమాపై కొన్ని అపోహలున్నాయని తనకు తెలియదని ఆయన అన్నారు. చిత్రాన్ని చూపించాలని తనను ఎవరూ అడగలేదని ఆయన అన్నారు. సెన్సార్ బోర్డు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+