బెజవాడ సినిమా చిచ్చు: వంగవీటి వర్సెస్ దేవినేని

అయితే విడుదలకు రెండు మూడు రోజుల ముందు నగరంలో వెలిసిన పోస్టరు మరోసారి కలకలం రేపింది. దేవినేని తనయుడు దేవినేని అవినాష్ పేరుతో నగర కూడలిలో ఓ పోస్టరు వెలిసింది. దేవినేని సోదరులు సృష్టించిన చరిత్ర కళ్లారా చూడటానికి బెజవాడ అంటూ ఆ పోస్టరులో ఉంది. దీంతో వంగవీటి వర్గాల్లో ఆందోళన రెట్టింపయింది. వంగవీటి కుటుంబాన్ని చిత్రంలో తక్కువ చేసి చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదని అడ్డుకుంటామని ఆయన వర్గం హెచ్చరిస్తోంది.
ఈ పోస్టరును ఎవరు వేసింది తెలియరాలేదు. పోస్టరు వల్ల నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి పోలీసులు దానిని తొలగించారు. నగర ప్రజల్లో బెజవాడ టైటిల్ నుండి మొదలైన హైటెన్షన్ వంగవీటి, దేవినేని వర్గాల హెచ్చరికల వరకు కొనసాగుతూనే ఉంది. చిత్రంలో ఏమైనా తేడా వస్తే ఊరుకునేది లేదని ఇరువర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో బెజవాడ చిత్రం విడుదల అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి కనిపిస్తోందట.












Click it and Unblock the Notifications