ఎవరీ పాల్ వాల్తాటీ?

ఐపియల్ 2011లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా వాల్తాటీ రికార్డు సృష్టించాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 189 పరుగులు సాధించడమనేదే తన ఆలోచనలో ఉందని వాల్తాటీ మ్యాచు ముగిసిన తర్వాత అన్నాడు. ఈ 27 ఏళ్ల కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ 2006లో ముంబైలో జరిగిన వన్డేలో మాత్రమే ఆడాడు. అతను ఆడిన వన్డే మ్యాచు అదొక్కటే. ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్ వంటివారితో కలిసి అతను 2002లో ప్రపంచ కప్ అండర్ 19 పోటీల్లో ఆడాడు. న్యూజిలాండ్ పర్యటనలో కంటికి గాయమైంది. దాంతో అతని కెరీర్ ముగిసినట్లేనని భావించారు. రెండు మూడేళ్ల పాటు అతను క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ స్థితిలో పంజాబ్ ఐపియల్ జట్టులోకి వచ్చాడు.
వాల్తాటీ ఇప్పటి వరకు 12 ట్వంటీ20 మ్యాచులు మాత్రమే ఆడాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 70. పూణే వారియర్స్‌పై ఓటమి పాలైన పంజాబ్ జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయాన్ని సాధించి పెట్టాడు. వాల్తాటీ చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగిన మ్యాచులో 63 బంతుల్లో 120 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. ఐపియల్‌లో ఇది మూడో అత్యధిక స్కోరు. అంతకు ముందు బ్రెండన్ మెక్‌కులం 158 పరుగులు, మురళీ విజయ్ 127 పరగులు చేశారు. చెన్నైతో జరిగిన మ్యాచులో వాల్తాటీ 19 ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదాడు. వాల్తాటీ ఒక సందర్భంలో 21 బంతుల్లో 88 పరుగులు చేశాడు. ఆ తర్వాత కొంత మందగించాడు. వాల్తాటీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసలు కూడా అందుకున్నాడు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications