ఎవరీ వెండీ డెంగ్ మర్దోక్?

ఆమె మొదటిసారి 1999లో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో వ్యక్తి అయింది. రెండో భార్య అన్నాకు విడాకులిచ్చిన 17 రోజులకే వెండీ డెంగ్ మర్దోక్‌ను పెళ్లి చేసుకుంది. మీడియా రారాజు మర్జోక్ ఫ్యాషనెబుల్ వైఫ్‌గా ఆమె అప్పటి నుంచి ఆసక్తికరమైన మహిళగానే ఉంది. ఆమె యాలే ఎంబిఎ డిగ్రీ సాధించింది.
డెంగ్ వెన్ జే 1969లో జన్మించింది. అప్పుడు మర్దోక్ 168 ఏళ్ల న్యూస్ ఆఫ్ వరల్డ్‌ను కొన్నాడు. ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలతో అది ప్రస్తుతం మూతపడింది. ఆమె చైనా మహిళ. చైనా సాంస్కృతిక విప్లవం తర్వాత జన్మించడంతో ఆమెకు డెంగ్ వెన్ జే అని పేరు పెట్టారు. పాఠశాల విద్యను చైనాలోనే ఆభ్యసించింది. స్టూడెంట్ వీసాపై కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలో చదవడానికి 1988లో అమెరికా చేరింది. ఆమె యాలే విశ్వవిద్యాలయం నుంచి ఎంబిఎ డిగ్రీ తీసుకుంది. అప్పటికే ఆమెకు పెళ్లయి, విడాకులు కూడా తీసుకుంది.
ఆ తర్వాత వెండీ 1996లో హాంగ్‌కాంగ్‌కు చేరింది. అప్పటి నుంచే ఆమె జీవితం అనూహ్యమైన మలుపులు తిరగడం ప్రారంభించింది. విమానంలో ఆమెకు బ్రూస్ చర్చిల్‌తో పరిచయమైంది. దాంతో స్టార్ టీవిలో ఇంటర్న్‌గా చేరింది. ఆ తర్వాత రెండేళ్లకే 1998లో రూపర్ట్‌ను కలుసుకుంది. 29 ఏళ్లకే స్కై టీవీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది, రూపర్ట్‌కు 57 ఏళ్లు. ఆ తర్వాత ఏడాదికే ఆమెను అతను పెళ్లి చేసుకున్నాడు. వారికిద్దరు పిల్లలున్నారు. వ్యాపార విషయాల్లో రూపర్ట్‌పై ఆమె ప్రభావం తీవ్రంగా ఉఁదని అంటారు.
ఫోన్ హ్యాకింగ్ కేసులో రూపర్ట్ మర్దోక్ పార్లమెంటరీ కమిటీ ముందు మంగళవారం హాజరై క్షమాపణలు చెప్పాడు ఆయన తన కుమారుడు జేమ్స్‌తో కలిసి వచ్చాడు. కాగా, ఫోన్ కుంభకోణాన్ని వెలికి తీసిన విలేకరి సీన్ హోరే అకస్మాత్తుగా మరణించాడు.












Click it and Unblock the Notifications