తప్పులో కాలేసిన చిరంజీవి

Chiranjeevi
విశాఖపట్నం బహిరంగ సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై శివాలెత్తిన తాజా కాంగ్రెసు నాయకుడు చిరంజీవి మౌనం వహించారు. విశాఖపట్నం నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన చిరంజీవి తిరిగి వచ్చారు. హైదరాబాదు తిరిగి వచ్చిన తర్వాత ఆయన చడీచప్పుడు చేయడం లేదు. ఆయన ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. వైయస్సార్ మరణించిన వెంటనే జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి మద్దతు ఇవ్వాలని తన వద్దకు వచ్చారని ఆయన విశాఖపట్నం సభలో అన్నారు. ఆ ప్రకటనే ఆయనను ఇబ్బందుల్లో పడేసినట్లు చెబుతున్నారు. దాంతో ఆయన మౌనం వహించినట్లు తెలుస్తోంది.

చిరంజీవి ప్రకటన వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని పసిగట్టి వెనక్కి తగ్గాలని సూచించినట్లు తెలుస్తోంది. తన వద్దకు వచ్చినవారి పేర్లు వెల్లడించాలనే డిమాండ్ చిరంజీవి ఎదుర్కోవాల్సి రావచ్చునని, దాని వల్ల ఆ పేర్లను వెల్లడించాల్సి వస్తుందని, దానివల్ల ప్రస్తుత మంత్రుల్లోని కొంత మంది పేర్లు కూడా చెప్పాల్సి వస్తుందని, అలా చెప్పాల్సి వస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడుతుందని అన్నట్లు తెలుస్తోంది.

దానికితోడు, కాంగ్రెసులో ఆయన పయనం సాఫీగా సాగడం లేదు. ఆయన అనుకున్నది ఏదీ జరగడం లేదు. తనకు కాంగ్రెసు అధిష్టానం పెద్ద బాధ్యతలు అప్పగించి, కీలకమైన హోదాను కల్పిస్తుందని భావించిన ప్రతిసారీ ఏదో విధమైన ఆటంకం వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సకల జనుల సమ్మె ఆయనకు పెద్ద గండంగా మారింది. తనతో పాటు తనను నమ్ముకున్నవారు కాంగ్రెసులోనో, ప్రభుత్వంలోనో తగిన స్థానాల కోసం వేచి చూడాల్సి వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+