సచిన్ ఎందుకలా చేతులెత్తేస్తున్నాడు?

ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా పేరు పొందిన సచిన్ టెండూల్కర్ కూడా మానవ మాత్రుడే. అతనిపై విపరీతమైన ఒత్తిడి పనిచేస్తున్నట్లు ఇటీవలి కాలంలో అవుటవుతున్న తీరు తెలియజేస్తోంది. తన సహజమైన ఆటను కూడా అతను ఒత్తిడిలో మరిచిపోతున్నట్లున్నాడు. తాను ఓ ఫీట్‌ను సాధించాల్సిన అవసరం ఉందనే భావన అతని గుండెను, మెదడును నిత్యం తొలిచి వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే తాను మరో మ్యాచ్ ఆడబోతున్నాననే అభిప్రాయంతోనే సచిన్ టెండూల్కర్ మైదానంలోకి దిగి, వందో సెంచరీ చేయాలన్న విషయాన్ని మనసులోంచి తుడిచి వేసి ఆడితే సచిన్‌కు సెంచరీ సాధించడం బహుశా, కష్టమైన పని కాకపోవచ్చు.
సచిన్ వ్యక్తిగతంగా ఒత్తిడికి గురవుతున్న సమయంలోనే, అభిమానుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉందనే విషయాన్ని కూడా ఆయన మరిచిపోయినట్లు లేరు. అందుకే అతను వందో సెంచరీకి కొత్తగా ఆడుతున్న ఆటగాడిలా వ్యవహరిస్తున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో సచిన్ వందో సెంచరీయే క్రికెట్ అభిమానులకు ఉన్న ఆశ. వెస్టిండీస్‌ను ఓడించడం భారత్‌కు నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు. కానీ సచిన్ కోట్లాది భారతీయ అభిమానులను నిరాశపరిచాడు. ఏమైనా, సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ చేస్తాడనే విషయంలో ఎవరికీ అపనమ్మకం లేదు.












Click it and Unblock the Notifications