తివారీ సెక్స్ స్కామ్ వెల్లడి వెనక బాబు?

Chandrababu Naidu
తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రస్తుత శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉదంతాన్ని బయటపెట్టిన వికీలీక్స్ మరో ఉదంతాన్ని కూడా వెల్లడించింది. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి మార్గం సుగమం చేసుకోవడానికి అప్పటి గవర్న్ ఎన్‌డి తివారీ సెక్స్ కుంభకోణాన్ని బయటపెట్టినట్లు వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణకు మధ్య సాన్నిహిత్యం వల్ల అది వెలుగు చూసిందని వికీలీక్స్ వ్యాఖ్యానించింది.

రాజభవన్‌లో ఎన్టీ తివారీ రాసలీలలపై ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఎన్డీ తివారీ సెక్స్ కార్యకాలాపాల్లో పాల్గొన్న వీడియోను చానెల్ ప్రసారం కూడా చేసింది. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో ఆరోగ్య కారణాలు చెప్పి ఎన్డీ తివారీ గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

తెలంగాణ ఉద్యమ అణచివేతకు రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్‌ను తేవడానికి సీమాంధ్ర నాయకులు వేసిన ఎత్తుగడలో భాగంగానే ఎన్డీ తివారీ ఉదంతం వెలుగు చూసినట్లు వికీలీక్స్ రాసింది. రాష్ట్ర గవర్నర్‌గా రాక ముందే నరసింహన్ తెలంగాణ ఉద్యమం గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినట్లు కూడా వికీలీక్స్ వెల్లడించింది. తెలంగాణ ఉద్యమానికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని నాదెండ్ల మనోహర్ అమెరికన్ కాన్సులేట్ వద్ద చెప్పినట్లు వికీలీక్స్ వెల్లడించిన అంశం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న క్రమంలో ఎన్డీ తివారీ సెక్స్ స్కామ్ గుట్టును వికీలీక్స్ విప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+