వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబును బాలయ్య గట్టెక్కిస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని సినీ నటుడు బాలకృష్ణ చేసిన ప్రకటన తెలుగుదేశం వర్గాల్లో కాస్తా ఉత్సాహాన్ని నింపింది. బాలకృష్ణ క్రియాశీలక పాత్ర పోషిస్తే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం సమకూరుతుందనే ఆశ తెలుగు తమ్ముళ్లలో చోటు చేసుకుంది. అయితే, అది సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని గట్టెక్కించగలరా అనేది మరో ప్రశ్న. బాలకృష్ణ తెలుగుదేశంలో క్రియాశీలక పాత్ర పోషిస్తే కాస్తా ఊపు వచ్చే మాట నిజమే. కానీ, చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ బాలకృష్ణకు స్వేచ్ఛనిచ్చే అవకాశం ఏ మాత్రం లేదు. ఆయన బాలకృష్ణ కీలక పాత్ర పోషించే స్థితిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటారనేది గతానుభవాల నుంచి చెప్పవచ్చు.

బాలకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించడం వల్ల నందమూరి కుటుంబం నుంచి చంద్రబాబుకు ముప్పు తప్పుతుంది. పార్టీపై పట్టు కోసం ప్రయత్నిస్తూ, నారా లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను అడ్డుకోవడానికి, వారి ప్రయత్నాలను తిప్పికొ్ట్టడానికి బాలకృష్ణ పనికి వస్తారు. అసలు బాలకృష్ణ ప్రవేశమే చంద్రబాబు వ్యూహంలో భాగంగా జరుగుతుందనే ప్రచారం ముమ్మరంగా ఉంది. ఆ ప్రచారంలో నిజం లేకపోలేదు కూడా. బాలకృష్ణను అడ్డం పెట్టుకుని నారా లోకేష్‌కు లైన్ క్లియర్ చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.

అయితే, బాలకృష్ణ పార్టీని గట్టెక్కించగలరా అనేది సందేహమే. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరిస్తారనేది కలలో మాటే. అందువల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తిరిగి బలోపేతం చేయడం ఆయన వల్ల అయ్యే పని కాదు. సీమాంధ్రలో కొంత మేరకు బాలయ్య ప్రభావం ఉండవచ్చు. కానీ, కాంగ్రెసులోని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను, చిరంజీవిని తట్టుకుని పార్టీని ముందుకు తీసుకుని పోవడం ఆయనకు అంత సులభం కాదు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సీమాంధ్రలో అత్యంత బలంగా ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. వైయస్ జగన్ జైలుకు వెళ్తారని, కాంగ్రెసుకూ తమకూ మధ్యనే పోటీ ఉంటుందని చంద్రబాబు నమ్ముతున్నట్లున్నారు. ఈ స్థితిలో బాలకృష్ణ ఇమేజ్ పార్టీకి ఉపయోగపడవచ్చుననేది అంచనా. అయితే, వైయస్ జగన్ పార్టీ ఏ విధమైన ప్రణాళికను సిద్దం చేసిందనేది పూర్తిగా తెలియడం లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడం కూడా బాలకృష్ణకు సాధ్యమవుతుందనేది చెప్పలేం. మొత్తం మీద, బాలకృష్ణ పార్టీని గట్టెక్కించడమనేది అంత సులభంగా కనిపించడం లేదు.

English summary
It is not easy to Balakrishna to revive Telugudesam party and save TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X