డర్టీ పిక్చర్: ఎవరిపై బురద?

దక్షిణాది సినిమాల్లో తన అందాలను ఆరబోసి యువతను మత్తులో ముంచిన సిల్క్ స్మిత అకాలంగా మృత్యువాత పడింది. ఆమె మరణం అప్పట్లో ఒక షాక్. అయితే ఆ మరణం వెనక రహస్యం ఏమిటనేది తేలలేదు. సిల్క్ స్మిత జీవితానికి డర్టీ పిక్చర్‌లో ఏ మాత్రం న్యాయం చేయలేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం సిల్క్ స్మిత వ్యక్తిగత జీవితంపై ఏ విధమైన పరిశోధనలు చేశారో, ఏ మేరకు వాస్తవాలను సినిమాలో చూపిస్తారో అర్థం కావడం లేదు. కానీ సినిమా మాత్రం విపరీతమైన ఆసక్తి కలిగిస్తోంది.
దక్షిణాది హీరోలను అప్రతిష్టపాలు చేసే ప్రణాళిక డర్టీ పిక్చర్ చిత్ర నిర్మాణంలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దక్షిణాదికి చెందిన ఓ సూపర్ స్టార్ సిల్క్ స్మితతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్నట్లు సినిమాలో చూపించినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ హీరోగా డర్టీ పిక్చర్‌లో నసీరుద్దీన్ షా నటించాడట. ఇద్దరు హీరోలను టార్గెట్ చేసుకుని ఈ సినిమా రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు అగ్గి మీద గుగ్దిలమవుతున్నారు.
విడుదలకు ముందే వివాదాలకు తెర తీసిన డర్టీ పిక్చర్ విడుదలైన తర్వాత ఎన్ని వివాదాలకు కారణమవుతుందో చెప్పలేం. సిల్క్ స్మిత జీవితాన్ని చిత్రించే విషయాన్ని పక్కన పెట్టి దక్షిణాది హీరోలను అప్రతిష్ట పాలు చేసే కోణం ఈ సినిమాలో ప్రధానంగా మారిందని అంటున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications