సత్యసాయి మృతి వెనుక.. హైకోర్టులో పిల్

శ్రీ సత్యసాయి బాబా సెంట్రల్ ట్రస్టును రద్దు చేసి తిరుమల తిరుపతిలో ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డు తరహాలో ఒక స్వయం ప్రతిపత్తి గల బోర్టు ఏర్పాటు చేసి దానికి ట్రస్టు బాధ్యతలు అప్పగించాలని పిటిషన్‌లో కోరారు. దీని కోసం దేవాదాయ చట్టానికి సవరణ చేయాలని సూచించారు. శ్రీ సత్యసాయి బాబా సెంట్రల్ ట్రస్టు ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేయాలని.. సత్యసాయి మరణానంతరం ట్రస్టు పర్యవేక్షణలో భారీ మొత్తాలను ప్రశాంతి నిలయం నుంచి బయటకు తీసుకెళ్లిన ఉదంతాలపై విచారణ జరిపించాలని కోరారు.
అంతవరకూ ట్రస్టును హైకోర్టు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని.. ఇందుకోసం ఓ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి ట్రస్టు బాధ్యతలు అప్పగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ వివరాల ప్రకారం సత్యసాయి ఆస్తులు 40వేల కోట్లకు పైగా ఉన్నాయని పిటిషన్‌లో తెలిపారు. ఇందులో యూనివర్సిటీ సముదాయం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హిల్‌వ్యూ స్టేడియం, ఎయిర్‌పోర్టు, ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం, జనరల్ హాస్పిటల్, మ్యూజియం, ప్లానిటోరియం, మ్యూజిక్ కాలేజీ కాంప్లెక్స్, వైట్‌ఫీల్డ్ ఉన్నాయని.. వీటితో పాటు 180 దేశాల్లో 1200 కేంద్రాల ఆధ్వర్యంలో పాఠశాలలు, ఆరోగ్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సత్యసాయి బాబాకు అత్యంత నమ్మకస్తుడైన సత్యజిత్ ఇటీవల బాబా వీలునామాను మీడియాలో ప్రకటించారని.. ఈ ఆస్తులకు బాబా కేవలం ట్రస్టీయేనని, భక్తులు ఇచ్చిన విరాళాలు ప్రజా సంక్షేమం కోసమే వినియోగించాలని వీలునామాలో ఉందని.. ఈ వీలునామాపై బాబా స్వయంగా సంతకం చేసారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఇటీవల సత్యసాయి బాబా వీలునామా రాశారని సత్యజిత్ తెలిపిన విషయం తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications