పాత సమరం కొత్తగా: వైయస్ జగన్ వర్సెస్ కోట్ల

కోట్ల విజయభాస్కర రెడ్డిని వైయస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో పలుమార్లు అవమానించారని చెబుతుంటారు. ప్రధాని పివి నరసింహా రావు సమక్షంలో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డిపై చెప్పులు కూడా వేయించారని అప్పట్లో వైయస్ విమర్శలు ఎదుర్కున్నారు. కోట్ల జీవించినంత వరకూ వైయస్ రాజకీయంగా కాంగ్రెస్‌లో ఎదగలేకపోయారు. రాష్ట్ర రాజకీయాల్లో ‘పెద్దాయన'గా అన్ని పార్టీల నుంచి పేరు తెచ్చుకున్న కోట్ల విజయభాస్కరరెడ్డిని వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికప్పుడు సవాల్ చేస్తూ వచ్చారు.
విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేస్తున్న సందర్భాల్లో వైయస్ సవాల్ విసురుతూ వెళ్లారు. కడపలో వైయస్‌కు వ్యతిరేకంగా విజయభాస్కర రెడ్డి మైసురారెడ్డిని ప్రోత్సహించారని అంటారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కోట్ల వర్గం బలంగా ఉండేది. కోట్ల మరణించిన తర్వాత ఆయన వర్గం అనేక కారణాల వల్ల పెద్దగా ఎదగలేకపోయింది. కోట్ల, మర్రి చెన్నారెడ్డి, జలగం వంటి హేమాహేమీలు మృతి చెందటం, నేదురుమల్లి ప్రభ తగ్గిపోవడంతో రాష్ట్రంలో వైయస్హవా పెరిగింది.
కోట్ల తనయుడు సూర్యప్రకాశరెడ్డి కర్నూలు పార్లమెంటు సభ్యుడదిగా విజయం సాధిస్తూ వస్తున్నా వైయస్ రాజశేఖర రెడ్డి ముందు తన బలాన్ని పెంచుకోలేకపోయారు. సోనియాగాంధీ, ఆంటోనీ వంటి ప్రముఖుల వద్ద మంచి పేరు ఉన్నప్పటికీ అది కేంద్రమంత్రి పదవి తీసుకురాలేకపోయింది. నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పినా ఆయన తిరస్కరిం చారు. ఇప్పటి వరకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన పనేదో తాను చేసుకు పోతున్నట్లు కనిపిస్తున్నారు. రాయలసీమలో వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉంది.
కోట్ల బలగం తిరిగి పుంజుకుంటే రాయలసీమలో జగన్‌ను ఎదుర్కోవడం, రెడ్డి వర్గాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందని భావించి సోనియాగాంధీ సూర్యప్రకాష్ రెడ్డిని ఎంచుకున్నట్లు సమాచారం. కడప జిల్లా నుంచే వైయస్ కుటుంబాన్ని ఎదుర్కొ నేందుకు కోట్ల సిద్ధమవుతున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్‌ను ఎదుర్కోవడంలో తగినంత తెగువ ప్రదర్శించకపోవడం కారణంగానే సూర్యప్రకాష్ రెడ్డి తెర మీదికి వస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications