వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ నాయకత్వంపై స్పష్టత ఇచ్చిన బాలకృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Balakrishna
హీరో నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. ఆదివారం విశాఖపట్నంలో పర్యటించిన బాలకృష్ణ పాడేరులో దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అందరం కృషి చేద్దామని టిడిపి కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. తన తండ్రి అభిమానులు టిడిపి కార్యకర్తలుగా మారారని, తన అభిమానులు సైతం అలాగే మారాలని సూచించారు. ఇటీవల కృష్ణా జిల్లాలో బాలకృష్ణ తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తాను పార్లమెంటు నుండి కాకుండా అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని చెప్పి టిడిపిలో, రాష్ట్రంలో సస్పెన్స్‌కు తెర లేపారు. అసెంబ్లీ నుండి పోటీ అని చెప్పడానికి కారణం, టిడిపిలో రెండో పవర్ సెంటర్‌గా ఏర్పడేందుకని, తండ్రి స్థాపించిన పార్టీలో నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత పెంచేందుకనే పలు వాదనలు వినిపించాయి.

గతంలోనే తాను పోటీలో లేనని బాలయ్య చెప్పినప్పటికీ, రాజకీయ ఆరంగేట్ర ప్రకటన అనంతరం మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాకుండా అసెంబ్లీకే పోటీ అని చెప్పారు. దీంతో టిడిపి వర్గాల్లో సంశయాలు, బాలయ్య అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయన్న వాదనలు వినిపించాయి. ఐతే ఆదివారం విశాఖ పర్యటనలో మాత్రం ఆయన పార్టీ నాయకత్వంపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ తాను పార్టీలో కొనసాగుతానని, తమ కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పారు. దీంతో ఇన్నాళ్ల సస్పెన్స్‌కు తెరపడినట్లేనని చెప్పవచ్చు.

English summary
Hero Balakrishna clarifed about Telugudesam Party leadership. He said in his Vishaka tour that he will continue in Chandrababu leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X