వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఈ 5 వస్తువులు తగ్గితే దరిద్రం వెంటాడుతుంది

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడల నిర్మాణం కాదు.. అది మన జీవన గమనానికి దిక్సూచి. మన కలల సౌథం. ముఖ్యంగా ఇంటి 'వంటగది' అనేది ఇంటి యజమాని అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని శాసించే శక్తి క్షేత్రం. వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలోని కొన్ని వస్తువులు పూర్తిగా ఖాళీ కావడం అనేది పేదరికానికి, మానసిక అశాంతికి దారితీస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్ష్మీ కటాక్షం కలగాలంటే అవి తగ్గకుండా ఉండాలి. వాటిగురించి తెలుసుకుందాం.

బియ్యం: ఐశ్వర్యానికి మూలం

బియ్యం కేవలం ఆహారం మాత్రమే కాదు,
శుక్ర గ్రహానికి, సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి సంకేతం.
బియ్యం డబ్బా అడుగు భాగం కనిపించేలా ఖాళీ కాకూడదు.
బియ్యం కొద్దిగా ఉన్నప్పుడే కొత్తవి అందులో పోయాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు.
సంపద నిరంతరం వృద్ధి చెందుతుంది.

Vastu Shastra if these five items run low in the kitchen poverty will haunt the household

ఉప్పు: నెగటివ్ ఎనర్జీని పారద్రోలే శక్తి

హిందూ ధర్మంలో ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.
ఉప్పు డబ్బా ఖాళీ కావడం అంటే ఆ ఇంట్లో రాహు దోషం ప్రభావం మొదలైందని అర్థం.
దీనివల్ల అనవసరపు గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.
ఉప్పు ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి.
ఇది ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

పసుపు: శుభకార్యాల చిహ్నం

పసుపు దేవగురువు బృహస్పతికి చిహ్నం.
జాతకంలో గురు బలం పెరగాలన్నా,
ఇంట్లో శుభకార్యాలు ఆగకుండా జరగాలన్నా పసుపు నిండుకోకూడదు.
వంటగదిలో పసుపు పూర్తిగా అయిపోతే 'గురు దోషం' ఏర్పడే అవకాశం ఉంది.
దీనివల్ల ఆదాయ మార్గాలు తగ్గడం లేదా పనుల్లో ఆటంకాలు రావచ్చు.

పిండి : గౌరవ మర్యాదలకు ప్రతీక

గోధుమ పిండి లేదా బియ్యం పిండి వంటి ధాన్యపు పిండి మన సామాజిక గౌరవానికి సంకేతమని వాస్తు చెబుతోంది.
పిండి డబ్బా పూర్తిగా ఖాళీ అయితే, సమాజంలో గుర్తింపు తగ్గడం
లేదా మానసిక ఒత్తిడి పెరగడం వంటివి జరుగుతాయి.
కాబట్టి పిండి నిండుకోకముందే కొత్తది నింపుకోవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.

వంట నూనె: శని దేవుని అనుగ్రహం

వంట నూనె శని గ్రహానికి సంబంధించినది.
శని దేవుని అనుగ్రహం ఉండాలంటే వంటగదిలో నూనె నిల్వలు ఎప్పుడూ ఉండాలి.
నూనె నిండుకుంటే శని దేవుని ఆగ్రహానికి కారణమై ఆకస్మిక ఖర్చులు పెరగొచ్చు
లేదా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టొచ్చు.
శని ప్రభావం సానుకూలంగా ఉండాలంటే నూనె ఖాళీ కాకుండా చూసుకోవడం ముఖ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+