ఆ గ్రామంలో ఒక్కొక్కరికి ఇద్దరు పెళ్ళాలు!

భారతదేశం విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. అటువంటి భారతదేశంలో చట్టం సైతం చూస్తూ ఊరుకునే అనేక కట్టుబాట్లు అనేక చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. చట్టపరమైన వ్యవస్థలను కూడా పట్టించుకోని అనేక ఆశ్చర్యకర సాంప్రదాయాలు మనల్ని షాక్ కు గురిచేస్తున్నాయి.

వింత వివాహ ఆచారాల గ్రామం

సహజంగా భారతదేశంలో ఒక వ్యక్తి ఒకరిని పెళ్లి చేసుకోవాలి. మొదటి భార్య ఉండగా ఇంకొక మహిళను పెళ్లి చేసుకున్నారని ఫిర్యాదు చేస్తే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. చట్టపరంగా శిక్షార్హులు. కానీ ఆ గ్రామంలో మాత్రం కాదు. రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మేర్ జిల్లాలోని రామ్‌దేయో గ్రామంలో వివాహ ఆచారాలు మన చట్టాలకు భిన్నంగా ఉంటాయి.

Unusual marriage tradition in ramdeyo village every man has two wives what about hindu marriage act

ఇద్దరిని పెళ్లి చేసుకునే పురుషులు.. గ్రామంలో అనాదిగా ఆచారం

ఇక్కడ, ప్రతి పురుషుడు ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు, ఇది అనాదిగా వారిలో పాతుకుపోయిన ఒక ఆచారం. ఒక్కసారి మాత్రమే వివాహం చేసుకున్న పురుషులు వారి మొదటి భార్యతో సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటారని, దాని ఫలితంగా తరచుగా ఆడపిల్లలు మాత్రమే పుడతారని భావిస్తారు. అందుకే ఇక్కడ అందరూ రెండవ వివాహాన్ని చేసుకుంటారు

సవతులు అక్కా చెల్లెళ్ళ మాదిరిగా సఖ్యంగా

ప్రతి పురుషుడి రెండవ భార్య అతనికి కుమారుడిని కంటుందని నమ్ముతారు. అందువల్ల కుటుంబ వంశం కొనసాగడానికి రెండవ వివాహం తప్పనిసరి అని ఆ గ్రామ వాసులు భావిస్తారు. ఇక తన భర్తను వేరే మహిళతో పంచుకోవటానికి సహజంగా ఏ భార్య అంగీకరించదు, కానీ ఇక్కడ భార్యలు కూడా భర్తలు రెండో పెళ్లి చేసుకోవటానికి సహకరిస్తారు. ఇద్దరు సవతులు అక్కా చెల్లెళ్ళ మాదిరిగా సఖ్యంగా ఉంటారు.

రాయసీమలోని ఆ జిల్లాలో భారీ ఏరో స్పేస్ పరిశ్రమ.. సీఎం చంద్రబాబు శుభవార్త!
రాయసీమలోని ఆ జిల్లాలో భారీ ఏరో స్పేస్ పరిశ్రమ.. సీఎం చంద్రబాబు శుభవార్త!

దేశానికంతటికీ ఉన్న ఈ చట్టం ఇక్కడ మాత్రం వీరికి చుట్టం

హిందూ సమాజంలో, విడాకులు తీసుకోకుండా మళ్ళీ వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధం. అయినప్పటికీ, రాజస్థాన్‌లోని ఈ గ్రామంలో, పురుషులు ఎలాంటి చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోకుండా రెండుసార్లు వివాహం చేసుకుంటూనే ఉన్నారు. ఇదంతా స్థానిక పోలీసులకు తెలిసినా చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు లేవు. ఎలాంటి కేసులు పోలీస్ స్టేషన్ లో నమోదు కావు. రెండో పెళ్లి చేసుకున్నా ఎవరి నుండి కంప్లయింట్ రాదు. దేశానికంతటికీ ఉన్న ఈ చట్టం ఇక్కడ మాత్రం వీరికి చుట్టం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+