హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడివాడ సెటిల్, హిందూపురం నుంచి బాలయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు లైన్ క్లియర్ అయినట్లే. ఎన్టీఆర్ 1994 ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. తండ్రి ఎన్టీఆర్ చివరి రోజుల్లో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచే తాను అసెంబ్లీకి ఎన్నిక కావాలని బాలకృష్ణ భావిస్తుండగా, చంద్రబాబు మాత్రం గుడివాడపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఎన్టీఆర్ స్వగ్రామం ఈ నియోజకవర్గంలో ఉన్న సంగతి తెలిసిందే. గుడివాడ సీటు విషయంలో స్పష్టత రావడంతో బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేయడం ఖాయమైందని అంటున్నారు.

శాసనసభ్యుడు కొడాలి నాని పార్టీ వీడి వెళ్లగానే చంద్రబాబు ఇదే అంశంపై బాలకృష్ణతో మాట్లాడారు. అయితే బాలకృష్ణ మాత్రం ఈ నియోజకవర్గంపై ఆసక్తి చూపలేదు. కాగా, బాలకృష్ణ చొరవ తీసుకోవడంతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సోమవారం ఆయన్ను కలిసి టిడిపిలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నియోజక వర్గ కార్యకర్తలతో చర్చించి టిడిపిలో చేరడంపై నిర్ణయం తీసుకుంటానని రావి వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు.

నాని పార్టీ వీడాక చంద్రబాబు రావి వెంకటేశ్వరరావును పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి వల్ల గుడివాడ టికెట్‌ను గతంలో రావి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా నానికి ఇచ్చారు. బాలకృష్ణ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని రావి వెంకటేశ్వరరావుకు నచ్చజెప్పినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. గుడివాడ టికెట్‌పై బాలకృష్ణ రావికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. రావి గుడివాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉండడం వల్ల బాలకృష్ణ హిందుపురం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.

2009 ఎన్నికల సమయంలోనే బాలకృష్ణ అసెంబ్లీకి పోటీ చేయాలని ఆసక్తి చూపించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉందని సూచన ప్రాయంగా అప్పుడు మీడియాతో అన్నారు. పోటీ చేసి ఒక్క నియోజక వర్గానికే పరిమితం కావడం కన్నా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తే, పార్టీకి ప్రయోజనం అని సూచించడంతో పోటీ చేయలేదు. ఈసారి ప్రచారం చేయడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. మేలో జరిగే మహానాడులో పార్టీలో ఏదైనా బాధ్యతలు స్వీకరించనున్నట్టు బాలకృష్ణ ఇటీవల వెల్లడించారు.

English summary
Nandamuri hero Balakrishna will contest from Hindupuram assembly seat of Ananthapuram district, as Ravi Venkateswar Rao agreed to come into TDP and contest from Gudivada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X