గుడివాడ వేడి: పెనమలూరు నుండి బాలయ్య పోటీ!

Balakrishna
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో తొడకొట్టినంత పని చేసి వేడి పుట్టించిన తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే అంశం పార్టీలో ముఖ్యంగా జిల్లా పార్టీలో ప్రధానంగా చర్చ సాగుతోంది. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో తన తండ్రి రెండుసార్లు ప్రాతినిథ్యం వహించిన గుడివాడ నుండి బాలయ్య పోటీ చేస్తారనే ప్రచారం తొలుత జరిగింది.

అయితే 2004కు ముందు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న రావి వెంకటేశ్వర రావు పార్టీలో చేరడంతో బాలయ్య గుడివాడ నుండి పోటీ చేస్తారనే ప్రచారానికి తెర పడింది. నానికి ముందు టిడిపి తరఫున రావి గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ అండతో కొడాలి నాని గుడివాడ టిక్కెట్ దక్కించుకున్నారు. దీంతో రావి పార్టీకి దూరమయ్యారు. 2009లోనూ నాని టిక్కెట్ పొంది గెలుపొందాడు. ఇప్పుడు టిడిపికి షాక్ ఇచ్చాడు.

రావిని బాలయ్య మెప్పించి ఒప్పించి తిరిగి పార్టీలో చేర్పించారు. స్వయంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్లి గుడివాడ టిక్కెట్ పైన హామీ ఇప్పించారట. దీంతో పార్టీలో చేరిన రావి నియోజకవర్గంలో క్రియాశీలకంగా మారారు. ఏళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న రావి పార్టీ క్యాడర్‌తో ఇప్పుడు మమేకం అవుతున్నారు. పనిలో పనిగా బాలయ్యలాంటి వారిని తీసుకు వచ్చి ప్రమోట్ అవుతున్నారు.

ఇలాంటి సమయంలో బాలయ్య గుడివాడ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు లేవు. అంతేకాకుండా నాని సవాల్ విసిరారు. నాని సవాల్ విసిరినప్పుడు బాలయ్య అక్కడ నుండి పోటీ చేసి గెలిచినా కొడాలి నాని ఇమేజ్ పెరుగుతుందే తప్ప మరొకటి ఉండదు. దీంతో ఎక్కడి నుండి ఆయన పోటీ చేస్తారనే ప్రశ్న టిడిపి నేతలను తొలచి వేస్తోంది. పెనమలూరు నుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ప్రస్తుతం పెనమలూరు నుండి మంత్రి పార్థసారథి ఉన్నారు. పెనమలూరు నుండి గత ఎన్నికల్లో పార్థసారథిపై పోటీ చేసి ఓడిపోయిన చలసాని పండు ఇటీవల మృతి చెందారు. దీంతో ఆ నియోజకవర్గం నుండే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. బాలయ్య జిల్లాలో పోటీ చేస్తే కృష్ణా జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ప్రభావం చూపుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+