వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ బెయిల్‌పై జోరుగా బెట్టింగ్స్.. జాతకమూ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయట. జగన్‌కు బెయిల్ వస్తుందని కొందరు రాదని, రాదని మరికొందరు వేలు, లక్,ల రూపాయల బెట్టింగ్స్ కడుతున్నారట. బెయిల్ వస్తుందనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఆ మేరకు వారు కూడా భారీ బెట్టింగులు కూడా కడుతున్నారట.

శుక్రవారం సుప్రీం కోర్టులో జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పెై విచారణ ఉన్న నేపథ్యంలో బెయిల్‌పెై ఉత్కంఠ నెలకొంది. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో భేటీ అవడం చర్చనీయాంశమయింది. గతంలో కూడా ఓవైసీ జెైలులో ఉన్న జగన్‌ను కలిసిన తర్వాతే జగన్‌ పార్టీ రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ప్రకటించింది.

ఢిల్లీలో మేకపాటి, సబ్బం హరి కాంగ్రెస్‌ నాయకత్వంలో చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత విజయమ్మ తనను కలసిన పార్టీ కార్యకర్తలతో 15 రోజుల్లో జగన్‌ బెయిల్‌పెై బయటకు వస్తారని చెప్పడం వివాదాస్పదమయింది. గత కొద్దిరోజుల క్రితం కూడా విజయమ్మ త్వరలో జగన్‌ బయటకు వస్తాడని భరోసా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కూడా జగన్‌ ఈనెల 28న నిర్దోషిగా బయటకు వస్తారని జోస్యం చెప్పారు.

ఇదిలా ఉండగా, శుక్రవారం జగన్‌కు కచ్చితంగా బెయిల్‌ వస్తుందన్న నమ్మకం ఆయన పార్టీలో కనిపిస్తోంది. చివరకు జగన్‌ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు సైతం 28న జగన్‌ బయటకు వస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారట. 28న సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు, విజయోత్సవాలు జరుపుకోవాలన్న సంకేతాలు కూడా వెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం. కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, కదిరి, హైదరాబాద్‌ , మిర్యాలగూడ, తిరుపతి వంటి ప్రధాన పట్టణాల్లో జగన్‌ విడుదలవుతారని వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు భారీ స్థాయిలో బెట్టింగులు కడుతున్నారట.

కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చర్చలు సఫలమయ్యాయని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు తప్పకుండా బెయిల్ వస్తుందని భావించి భారీ మొత్తంలో బెట్టింగులు కడుతున్నారట. అంతేకాదు జగన్ జాతక రీత్యా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని ఉందట. ఇది కూడా భారీ బెట్టింగులకు అవకాశమిస్తోందని అంటున్నారు.

English summary
It is said that Bettings are going in Andhra Pradesh on YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy's bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X