బొత్స సేఫ్, ఎమ్మార్ పాపం ఐఎఎస్‌లదే

Botsa Satyanarayana
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి, ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సేఫ్‌గా ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఆయన ఏ తప్పు చేయలేదని తెలియజేస్తోంది. అందుకే బొత్స సత్యనారాయణ అప్పటి మంత్రి వర్గం బాధ్యత గురించి కూడా కచ్చితంగానే మాట్లాడుతున్నారు. ఎమ్మార్ కుంభకోణంలో బొత్స సత్యనారాయణ ఏ విధమైన తప్పు చేయలేదని, అప్పటి ఐఎఎస్ అధికారులే ఆయనకు విషయాలు తెలియకుండా చేశారని చెప్పింది. ఎపిఐఐసి మాజీ చీఫ్‌లు బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం, అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కెవి రావు కుంభకోణానికి బాధ్యులని తేల్చి చెప్పింది.

బొత్స సత్యనారాయణ అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి పెట్టిన సీక్రెట్ నోటే ఆయనను కాపాడుతోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించి 2005 జనవరి 27వ తేదీన జీవో జారీ అయింది. హైదరాబాదులోని ఉన్నప్పటికీ అప్పటి ముఖ్య కార్యదర్శి కెవి రావు ఫైల్‌ను బొత్స సత్యనారాయణకు పంపించకుండానే జీవో జారీ చేశారు. జీవో జారీ అయిన తర్వాత ఫైల్‌ను బొత్స సత్యనారాయణకు పంపించారు. జీవో జారీకి ముందే తనకు ఫైల్ పంపించాల్సి ఉండిందని, దానికి వివరణ ఇవ్వాలని బొత్స సత్యనారాయణ రాశారు. ఫైల్‌ను ముఖ్యమంత్రి వైయస్‌కు ఎందుకు పంపించారు, ఆర్డర్స్‌లో ఉన్న తేడా ఏమిటని కూడా బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 33 ఏళ్ల కోసం లీజు రెంటల్స్ 3 శాతం పెంపు (గల్ఫ్ కోర్సు నుంచి) ఎందుకు తొలగించారని కూడా బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

ఫైల్‌పై బొత్స సత్యనారాయణ తన రిమార్క్స్ రాసి కెవి రావుకు పంపించారు. తాను లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్రమైన నోట్ తయారు చేసి తనకు పంపాలని కూడా ఆయన ఆదేశించారు. అంత వరకు జీవోను అమలును నిలిపేయాలని సూచించారు. జీవో జారీకి ముందు స్పష్టం చేసుకోవాల్సిన అంశాలపై ఓ సీక్రెట్ నోట్ తయారు చేసి 2005 మార్చి 17వ తేదీన బొత్స సత్యనారాయణ అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి పంపించారు. ఈ సీక్రెట్ నోట్‌ను పరిగణనలోకి తీసుకుని లీజు రెంటల్స్ సవరణను ఆమోదించారు. ఈ సీక్రెట్ నోట్ బొత్స సత్యనారాయణను రక్షించిందని చెప్పాలి. లేకుంటే, ఇరుక్కునేవారే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+