వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహం: బాబు వర్సెస్ పురంధేశ్వరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari-Chandrababu Naidu
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుండెల్లో బాంబు పేల్చారు. పార్లమెంటు ఆవరణలో ఎన్టీ రామారావు విగ్రహ స్థాపనపై ఆమె పావులు కదిపినట్లే కనిపిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. హిందీ ఆకాడమీ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహ స్థాపన విషయంలో చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు వెంటనే ఆ అంశంపై దృష్టి సారించాల్సి వచ్చింది.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దశ దిశల వ్యాప్తి చేసిన ఎన్‌టీఆర్‌విగ్రహాలను పార్లమెంట్ భవనం ఆవరణలో నెలకొల్పే విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీకి లేదని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆరోపించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ బొమ్మను చూస్తే చంద్రబాబు నాయుడుకు సైతాన్‌లాగానో, మరొకటిలాగానో కనిపిస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు. విజయవాడ ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

తాను సేకరించిన సమాచారం మేరకు ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికే చిత్త శుద్ధిలేనట్లుగా కనిపిస్తున్నదన్నారు. అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌ల విగ్రహాలనునెలకొల్పేందుకు 2000 డిసెంబర్ 19వ తేదీన అప్పటి స్పీకర్ జీఎంసీ బాలయోగి అధ్యక్షతన కమిటీ సమావేశమై అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ విగ్రహాలను నెలకొల్పడానికి నిర్ణయం తీసుకుందన్నా రు. కానీ, 2005 వరకు కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లేఖ రాయలేదని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చంద్రబాబు వెంటనే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిటిడిపి)ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీపీ సమావేశం జరిగింది. సోమవారం లేదా మంగళవారం స్పీకర్‌ను కలిసి ఎన్టీఆర్ విగ్రహ స్థాపనకు తేదీని కోరాలని నిర్ణయించారు. కాగా, కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్ళిన చంద్రబాబు ఈ నెల 27న తిరిగొస్తున్నారు. తర్వాత పార్టీ నేతలతో కలిసి రెండు రోజుల ఢిల్లీ యాత్రకు వెళ్తున్నారు. ఢిల్లీలో సీపీఐ అనుబంధ రైతు సంఘం నిర్వహిస్తున్న సెమినార్‌లో పాల్గొంటారు.

ఎన్టీ రామారావు విగ్రహ స్థాపన విషయాన్ని రాజకీయం చేయవద్దని తెలుగుదేశం సీనియర్ నాయకుడు కె. ఎర్రంనాయుడు పురంధేశ్వరికి సూచించారు. తెలుగుదేశం పార్టీ తరఫున విగ్రహాన్ని అందించడానికి సహకరించాలని కూడా ఆయన కోరారు. మొత్తమ్మీద పురంధేశ్వరి చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు పురంధేశ్వరి నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోంది.

English summary
It is said that union minister Daggubati Purandeswari has decided to make an issue on his father BT Rama Rao statue installation in the Parliament premises. Telugudesam party president N Chandrababu Naidu irked with the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X