చిరంజీవి వ్యాఖ్యలు: జగన్ అరెస్ట్‌పై మళ్లీ ఊహాగానాలు

Chiranjeevi - YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు పైన మళ్లీ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే జగన్‌కు చెందిన మీడియా బ్యాంక్ ఖాతాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) స్తంభింప చేసింది. ఆ తర్వాత మీడియా ఆస్తులపై అటాచ్‌మెంట్ ఉత్తర్వులు ఇవ్వాలని సిబిఐ ప్రభుత్వానికి లేఖ రాసింది. సిబిఐ లేఖపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

ఏ క్షణంలోనైనా జగన్ మీడియాకు చెందిన ఆస్తుల జప్తుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందంటున్నారు. ఆ తర్వాత జగన్‌కు చెందిన పూర్తి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసే ఆస్కారముందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) కూడా జగన్ ఆస్తులపై దృష్టి సారించింది. ఆయన కంపెనీలలోకి మనీలాండరింగ్ ద్వారా ఏమైనా డబ్బు వచ్చిందా తెలుసుకునేందుకు కోర్టులో సిబిఐ సమర్పించిన తొలి ఛార్జీషీటును ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది.

దానిపై గురువారం తీర్పు వెలువడనుంది. సిబిఐ ఛార్జీషీట్ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పినందు వల్ల కోర్టు ఈడికి కాపీని ఇవ్వవచ్చుననే కోర్టు తీర్పు చెప్పే అవకాశముందని అంటున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో జగన్‌ను చట్ర బంధంలో ఇరికించే ప్రయత్నాలలో భాగంగానే ఈ కేసులో దూకుడుగా సిబిఐ, ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. మరోవైపు సిబిఐ ఈ కేసులో వరుస అరెస్టులకు తెరతీసింది.

ఎ-2 నిందితుడిగా ఉన్న విజయ సాయి రెడ్డిని అరెస్టు చేసిన దాదాపు నాలుగు నెలల తర్వాత ఎ-12గా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను, మరో అధికారిని అరెస్టు చేశారు. త్వరలో మరిన్ని అరెస్టులు అయ్యే అవకాశముందని అంటున్నారు. జగన్ అరెస్టు పైనా సిబిఐ దృష్టి సారించిందని అంటున్నారు. గతంలో జగన్ అరెస్టుకు రెక్కీ నిర్వహించిందనే ప్రచారం జరిగింది. అరెస్టుకు కూడా ప్రయత్నాలు చేసిందనే వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పటి వరకు జగన్ అరెస్టు జరగలేదు. అయితే ఈ నెల 28న జగన్ కోర్టుకు హాజరైన పక్షంలో ఆయనను అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి గురువారం నెల్లూరులో మాట్లాడుతూ... ఈ నెల 28న ఏమైనా జరగవచ్చునని చెప్పారు. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి, అధిష్టానంతో ఉప ఎన్నికలు తదితర అంశాలపై చర్చించి వచ్చారు. ఢిల్లీలో చిరంజీవికి జగన్ అరెస్టు పైన ఏమైనా సంకేతాలు అందాయా అందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే ప్రశ్న పలువురిలో తలెత్తుతోంది.

ఈ నెల 28న తమ ముందు హాజరు కావాలని సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్‌కు సమన్లు పంపించిన విషయం తెలిసిందే. తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనని, తన న్యాయవాది హాజరవుతారని జగన్ కోర్టుకు చెప్పవచ్చు. కానీ ఆయనే స్వయంగా కోర్టుకు హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. చిరంజీవి కూడా ఈ నెల 28న ఏమైనా జరగవచ్చునని చెప్పారు. దీంతో జగన్‌ను ఆ రోజు అరెస్టు చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే ఉప ఎన్నికల దృష్ట్యా అరెస్టు జరగకపోవచ్చునని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+