బాలయ్య, చిరు ఫైట్: ఎవరిది పై చేయి?

చిరంజీవిపై పోటీకి బాలయ్యే సరైన అభ్యర్థి అని కొందరు భావిస్తున్నారు. బాలయ్యకు తన ఇమేజ్‌ను వోట్లుగా మలుచుకునే సత్తా ఉందని, ఐనా గత 2009 సాధారణ ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల్లో పోటీ చేసిన చిరంజీవి తిరుపతిలో ఆశించిన మెజార్టీతో గెలవలేదని, అంతేకాకుండా పాలకొల్లులో ఏకంగా బంగారు ఉషారాణి చేతిలో ఓడిపోయారని టిడిపి నాయకులు గుర్తు చేస్తున్నారు. సినిమాల్లో చిరంజీవి, బాలయ్యకు పోటా పోటీగా ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి వచ్చేసరికి సమీకరణాలు మారుతాయని అభిప్రాయపడే వారు ఉన్నారు. బరిలోకి దిగితే తమ నేత గెలవడం ఖాయమని చిరు, బాలయ్య వర్గం వారు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య, చిరంజీవి మధ్య జరుగుతున్న రాజకీయ మాటల యుద్ధం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పుట్టించిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications