తెలంగాణపై సిఎం క్లియర్: రెండో ఎస్సార్సీ అంటూ..

తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం చెప్పకపోతే మాత్రం పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణకు సంబంధించిన పరిణామాలపై, తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో పార్టీ పరిస్థితిపై ఆయన అధిష్టానానికి వివరించినట్లు చెబుతున్నారు. తెలంగాణలో తెరాస ప్రాబల్యం తగ్గుతోందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఆరు సిఫార్సులు చేసినందున నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారిన స్థితిలో రెండో ఎస్సార్సీ వేయడం మంచిదని ఆయన అన్నట్లు తెలుస్తోంది. తెలంగాణవాదాన్ని దెబ్బ తీయడానికి తాను ఎస్సార్సీ వేయాలని అనడం లేదని, పార్టీకి దానివల్ల ఊరట లభిస్తుందని చెబుతున్నానని ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే నివేదికలను ఆయన పార్టీ అధిష్టానం పెద్దలకు సమర్పించినట్లు సమాచారం.
ఇదిలావుంటే, తెలంగాణపై చర్చించేందుకు పార్టీ అధిష్టానం ఈ నెల 28వ తేదీలోగా ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మరోసారి ఢిల్లీకి పిలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై ఈ నెల 28వ తేదీన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అఖిల పక్షాన్ని నిర్వహిస్తోంది. ఈ స్థితిలో తాము అఖిలపక్ష సమావేశంలో అనుసరించే వ్యూహంపై అధిష్టానం పెద్దలు ముఖ్యమంత్రితోనూ పిసిసి అధ్యక్షుడితోనూ చర్చించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications