సభా సంఘం: వైయస్ జగన్‌కు మరో షాక్

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెసుకు చెందిన వి. హనుమంతరావు వంటివారు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్‌లకు) సేకరించిన భూములపై కూడా విచారణ జరగాలని వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ అంశం కూడా సభా సంఘం విచారణ పరిధిలోకి వస్తుంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపుల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు.
తన ఆస్తులపై, గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాలపై, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు వైయస్ జగన్‌కు ఇబ్బందికరమైన పరిస్థితినే కల్పిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నిర్ణయాలు, అక్రమ వ్యవహారాలు మొత్తం ఈ మూడు కేసుల దర్యాప్తులో బయటపడతాయని భావిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ ప్రయోజనం పొందారనే విమర్శ వినిపిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగి భూకేటాయింపుల వ్యవహారం కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డికి చుట్టుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని అంది పుచ్చుకుని రాజకీయాలు చేయాలని భావిస్తున్న వైయస్ జగన్‌ను దెబ్బకొట్టే వ్యూహం కూడా ఇందులో ఇమిడి ఉందని భావిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోని అవకతవకలను, అక్రమాలను బయటకు తేవడం ద్వారా ఆయన ఇమేజ్‌ను దెబ్బ తీయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. దానివల్ల వైయస్ జగన్ రాజకీయాలు దెబ్బ తింటాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications