ఇంకా జగన్ లెక్కలు తేల్చని ఐటి శాఖ

కొన్నేళ్ల ఆదాయం పన్ను అంచనాల ప్రక్రియ పూర్తయిందని, మరి కొన్నేళ్ల అంచనాల ప్రక్రియ సాగుతోందని చెప్పారు. కొన్ని కేసులు వివాదంగా మారాయని, అవి ఐటి అప్పిలేట్ అథారిటీ ముందు ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని ఐటి శాఖ డిమాండ్స్ పెండింగులో ఉండగా, కొన్ని డిమాండ్ నోటీసులకు చెల్లింపులు జరిపారని ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ ఆదాయం శాఖ చీఫ్ కమిషనర్ జెకె హోటా మీడియా ప్రతినిధులతో చెప్పారు.
నిరుడు మార్చిలో వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌కు ఐటి శాఖ 122 కోట్లకు సంబంధించి డిమాండ్ నోటీసును, షోకాజ్ నోటీసును జారీ చేసింది. 2010 - 2011 ఏప్రిల్, సెప్టెంబర్ మాసాలకు గాను 84 కోట్ల రూపాయల ముందస్తు పన్ను చెల్లించినట్లు తెలియడంతో జగన్ సంపదపై దర్యాప్తు ప్రారంభించినట్లు హోటా తెలిపారు. అంతకు ముందు రెండేళ్లకు చెల్లించిన ఆదాయం పన్ను కన్నా భారీగా ఉండడంతో ఈ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
2008 - 2009కి గాను జగన్ 2.92 లక్షలు, 2009 - 2010గాను 6.72 లక్షల ఆదాయం పన్నును వైయస్ జగన్ చెల్లించారు. పెండింగ్ డిమాండ్ వివరాలను ఇవ్వడానికి హోటా నిరాకరించారు. అంచనాలు వేయడమనేది నిరంతర ప్రక్రియ అని, గ్రూప్ ఆఫ్ కేసులున్నాయని, వివిధ కంపెనీలకు చెందిన 13 ఫైళ్లకు సంబంధించినవని హోటా అన్నారు.
అవినీతి ఆరోపణలపై సిబిఐ వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు.












Click it and Unblock the Notifications