భారత క్రీడలు: ఎంపి సచిన్ విజన్ డాక్యుమెంట్

Sachin Tendulkar
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడిగా ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన బాధ్యతలను నిర్వహించడం ప్రారంభించారు. హడావిడి, సందడి ఏమీ లేకుండా ఆయన పనిచేసుకుపోతున్నట్లు తెలుస్తోంది. భారత క్రీడలకు సంబంధించి ఆయన రోడ్ మ్యాప్ తయారు చేశాడు. తన విజన్ డాక్యుమెంట్‌ను సచిన్ టెండూల్కర్ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్‌కు, క్రీడల మంత్రి అజయ్ మకేన్‌కు సమర్పించారు. గత నెలలోనే సచిన్ టెండూల్కర్ ఆ పనిచేశాడట.

భారతదేశంలో క్రీడలను ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలనే అంశంపై సచిన్ టెండూల్కర్ రెండు పేజీల సంక్షిప్త సమాచారానికి, 25- స్లయిడ్ ప్రజంటేషన్‌ను జత చేసి ఇచ్చాడు. ఇందులో ఆయన నాలుగు ప్రధానాంశాలపై దృష్టి పెట్టాడు. పునాది స్థాయిలోని ప్రతిభను గుర్తించి, పైకి తేవడం ఎలా, నిగ్గు తేలిన యువ ప్రతిభను గుర్చించడం ఎలా అనే విషయంపై దృష్టి పెట్టి విజన్ డాక్యుమెంటును సచిన్ రూపొందించాడు.

మరింత సమర్థతను పెంచడానికి విశ్వవిద్యాలయాలు, కళాశాల స్థాయిల్లో తీసుకోవాల్సిన చర్యలపై, మౌలిక సదుపాయాలను, నైపుణ్యాలను పెంపొందిచే విధానాలను పెంచడంపై దృష్టి పెట్టి దాన్ని రూపొందించాడు. అలాగే, వ్యాయామాన్ని ప్రతి భారతీయుడికి అనివార్యం చేయాల్సిన అవసరాన్ని తెలియజేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

2012 ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ పతక విజేతలను భారతదేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్పాడు. సచిన్ టెండూల్కర్ సూచనల పట్ల కపిల్ సిబాల్ ఫిదా అయినట్లు చెబుతున్నారు. పాఠ్యప్రణాళికలో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీగా కాకుండా అనివార్యమైన సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలనే సచిన్‌పై కపిల్ సిబాల్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+