గన్ ఉన్మాదం: అమెరికా వెలుగుల వెనుక...
అమెరికాలో గన్ ఉన్మాదం పెరుగుతోంది. పైకి అమెరికా అభివృద్ధిలో ఘనంగా కనిపిస్తున్నప్పటికీ ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు అక్కడి యువతలో ఉన్న నిరాశ, నిస్పృహతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే మూడు నాలుగు సంఘటనలు ఇలాంటివి జరిగాయి. గతంలో కొలరాడో థియేటర్లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి చెందగా 60 మంది వరకు గాయపడ్డారు.
గురుద్వారలో మరో ఉన్మాది కాల్పులు జరిపాడు. తాజాగా పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 28 మంది వరకు చనిపోయారు. ఈ ఘటన మరవక ముందే ఆమెరికాలో మరో సంఘటన జరిగింది. పాఠశాలలో కాల్పులు జరిగిన శుక్రవారం రాత్రి లాస్‌వెగాస్ స్ట్రివ్‌లోని ఎక్స్‌కాలిబర్ హోటల్లో ఓ అగంతకుడు ఓ మహిళపై కాల్పులు జరిపాడు. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గాయపడిన మహిళ మరణించింది.
అయితే ఈ ఘటనలు అమెరికా సమాజంలోని అశాంతి, యువతలోని అసహనాన్ని బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. స్వేచ్ఛ పేరుతో అమెరికాలో విచ్చలవిడితనం పెరిగిపోవడమే ఇలాంటి సంఘటనలకు కారణంగా కనిపిస్తోంది. ఉగ్రవాదులను అడ్డుకోగల్గిన అమెరికా ఇంట్లోని సమస్యను మాత్రం ఎదుర్కోలేకపోతోంది. అమెరికాలో తుపాకుల సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. దేశంలో జనాభా 30 కోట్లుగా ఉంటే తుపాకులు 27 కోట్లు ఉండటం గమనార్హం.

పాఠశాలలో కాల్పుల ఘటనపై మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టిన బరాక్ ఒబామా

శాండీ హుక్ స్కూల్..

ఎంత ఘోరం జరిగింది...

రోదిస్తున్న మృతుల బంధువులు

కాల్పుల ఘటన జరిగిన శాండీ హుక్ గ్రామం

న్యూటౌన్‌లో ప్రజలు కొవ్వొత్తుల ప్రదర్శన

కాల్పుల ఘటన తర్వాత ఓ తండ్రి తన కూతురును పాఠశాల నుండి బయటకు తీసుకు వెళ్తూ...

రోదిస్తున్న యువతి

దేవుడా...
ఈ సంవత్సరంలోనే అమెరికాలో ఉన్మాదుల కాల్పులు నాలుగుసార్లు జరిగాయి. పాఠశాల కాల్పుల ఘటన అమెరికా చరిత్రలోనే రెండోది. అక్కడి సామాజిక జీవనంలో కూడా తప్పుందనే వారున్నారు. స్వేచ్ఛ చట్రంలో ఇరుక్కున్న అక్కడి ప్రజలు ఆ చట్రం నుండి బయటకు రాలేక పోతున్నారు. అష్టఐశ్వర్యాలు ఉండటంతో దేనికీ లోటు లేదు! మంచి చెడు చెప్పే వారు లేరు! తుపాకీ సంస్కృతి పెరుగుతుండటంతో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలని వైట్ హౌస్ పైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అమెరికా వెలుగు వెనుక ఉన్న ఇలాంటి చీకటి పట్ల అక్కడి సమాజం ఆందోళన చెందుతోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications