టివి9 సర్వే కెసిఆర్, జగన్‌కు అనుకూలమా?

ఏఏ అభ్యర్థి ఎంత శాతంతో గెలుస్తారని కూడా ఈ సర్వే తెలిపింది. కొవూరులో జగన్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 15 శాతం ఆధిక్యంతో గెలుస్తారని తెలిపింది. నాగం జనార్ధన్ రెడ్డి 18 శాతం ఆధిక్యంతో గెలుస్తారని తెలిపింది. టిఆర్ఎస్ అభ్యర్థులు ఇబ్రహీం (మహబూబ్‌నగర్) 9 శాతం, జూపల్లి కృష్ణా రావు (కొల్లాపూర్) 15 శాతం, జోగు రామన్న (అదిలాబాద్) 15 శాతం, గంపగోవర్ధన్(కామారెడ్డి) 6 శాతం, రాజయ్య(స్టేషన్ ఘనపూర్) 15 శాతంతో గెలుస్తారని సర్వే తెలిపింది. కాగా సర్వేలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మండిపడింది. టిఆర్ఎస్ కూడా ఈ సర్వేపై అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ మెజార్టీ వస్తుందని తాము చెబుతుంటే టివి9 సర్వే అందుకు విరుద్ధంగా ఉండటాన్ని వారు తప్పు పడుతున్నారట.












Click it and Unblock the Notifications