కావూరి రాజీనామాలో ట్విస్టు, మెలిక

Kavuri Sambasiva Rao
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివ రావు రాజీనామా లేఖలో ట్విస్టు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖలో ఆయన ఓ మెలిక పెట్టారట. దీంతో తనకు కావూరి సాంబశివరావు అందజేసిన రాజీనామా లేఖపై లోకసభ స్పీకర్ మీరాకుమార్‌ ఇప్పుడిప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అంటున్నారు.

రాజీనామా పత్రంలో కావూరి కొన్ని షరతులు పెట్టారని అంటున్నారు. దాంతో మీరా కుమార్ ఇప్పుడిప్పుడే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు. కావూరి పేర్కొన్న షరతుల కారణంగా రాజీనామాను ఆమోదించాల్సి వస్తే, వచ్చే ఏడాది జనవరి మొదటివారం వరకూ ఆగక తప్పని స్థితి ఉందని చెబుతున్నారు.

ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో చోటు లభించనందుకు ఆగ్రహించిన కావూరి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా పంపిన విషయ తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనే కావూరి ఇటీవల లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను కలిసి స్వయంగా రాజీనామా లేఖ అందించారు.

అయితే కావూరి సాంబశివరావు తన రాజీనామా లేఖను 2013 జనవరి 1 తరువాతే అమల్లోకి వచ్చేలా ఆమోదించాలని షరతు విధించినట్టు సమాచారం. కావూరి సాంబశివ రావు షరతులతో కూడిన రాజీనామా లేఖను పంపించటంతో స్పీకర్ మీరాకుమార్ దాన్ని పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కావూరి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేయాలని యోచిస్తోన్న విషయం తెలిసిందే.

లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కావూరి పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరు కావటం లేదు. రాజీనామా లేఖను వెనక్కి తీసుకోవాలని పార్టీ అధిష్టానం పెద్దలతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరినా కావూరి సాంబశివరావు వినలేదు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్వయంగా ఆహ్వానించి చెప్పినా రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి మొండికేశారు. అయితే, సోనియా గాంధీ పిలిస్తే ఆలోచన చేస్తానని ఆయన ఇటీవల అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+