యూరో మిలియన్స్ కొట్టాడు.. 1290 కోట్లు పట్టాడు

ఇంతకుముందు అత్యధికంగా స్కాట్లాండ్‌కు చెందిన కాలిన్, క్రిస్ జంట గతేడాది జూలైలో రూ. 1257 కోట్లు దక్కించుకుంది. ఇప్పుడు ఇతను వారిని తలదన్ని మరింత మొత్తాన్ని దక్కించుకున్నాడు. అదృష్ట దేవత కరుణా కటాక్ష వీక్షణాలు ఇంగ్లండ్ మీద మరోసారి ప్రసరిస్తున్నాయని, మరోమారు యూరో మిలియన్స్ లాటరీ తమ దేశానికి దక్కిందని బ్రిటిష్ నేషనల్ లాటరీ సంస్థ ప్రకటించింది.
దాదాపు 11 కోట్ల మంది ఈ లాటరీ టికెట్లు కొనగా.. వారిలో ఒక్కరికి మాత్రం ఈ అదృష్టం దక్కింది. బంపర్ బహుమతి తగిలిన విజేత తనకొచ్చిన మొత్తంతో దాదాపు నాలుగున్నర టన్నుల బంగారం, 700 ఫెరారీ స్పోర్ట్స్ కార్లు లేదా సొంత ఎయిర్‌బస్ విమానం కొనుక్కోవచ్చునని లాటరీ నిర్వాహకులు ప్రకటించారు. 2004లో ప్రారంభించిన యూరోమిలియన్స్ లాటరీని ప్రస్తుతం యూరప్‌లోని తొమ్మిది దేశాల్లో ఆడుతున్నారు.
ఆస్ట్రియా, బెల్జియం, బ్రిటన్, ఫ్రాన్స్, ఐర్లండ్, లగ్జెంబర్గ్, పోర్చుగల్, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలు ఆడుతున్నాయి. యూరో మిలియన్ చరిత్ర మొత్తమ్మీద ఇప్పటి వరకు పది జాక్‌పాట్లు రాగా, వాటిలో ఐదు బ్రిటన్‌కే వెళ్లాయి. అందులోనూ ఈ లాటరీని బ్రిటిష్ పంటర్లే ఎక్కువగా కాస్తుంటారు. అందుకే అదృష్టవంతుల్లో వారే ఎక్కువగా ఉంటారు. అదృష్టం వరించిన అదృశ్య వ్యక్తికి ఆహ్వానం పలికేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నామని నిర్వహణ సంస్థ పేర్కొంది.












Click it and Unblock the Notifications