భారత సంతతి రామకృష్ణన్‌కు నైట్‌హుడ్

venkatraman ramakrishnan
కణ జీవ శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన భారత సంతతి అమెరికా శాస్త్రవేత్త వెంకట్రామన్ రామకృష్ణన్‌ను బ్రిటన్ ప్రభుత్వం నైట్‌హుడ్‌తో గౌరవించింది. మాలిక్యూలర్ బయాలజీలో ఆయన చేసిన కృషికి 2012గానూ ఈ సత్కారం చేస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ఓ అధికారిక ప్రకటనలో తెలియజేసింది. రామకృష్ణన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని ఎంఆర్‌సీ లేబరేటరీలో మాలిక్యూలర్ బయాలజీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. బ్రిటన్ రాచరికం ప్రదానం చేసే వ్యక్తిగత అత్యున్నత పురస్కారం నైట్ హుడ్. రామకృష్ణన్ తమిళనాడులోని చిదంబరంలో జన్మించారు. రామకృష్ణన్‌ను 2010లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 58 ఏళ్ల రామకృష్ణన్ కేంబ్రిడ్జిలోని ఎమ్మార్సీ లేబరేటరీస్‌లో కణ జీవశాస్త్రంపై విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉంది. ఆయన బరోడా, ఓహియో, శాండియాగో వర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించారు.

ఇక్కడికి వలస వచ్చిన వారు బ్రిటీష్ సమాజానికి చేస్తున్న సేవలను నాకు వచ్చిన ఈ సత్కారం ప్రతిబింబిస్తోందని, నాతో పాటు ఇక్కడ చాలా మంది వలసవచ్చిన వారు పనిచేస్తున్నారుని, అంతా కలిసి ఆధునిక జీవశాస్త్రాన్ని అభివృద్ధి చేశామని రామకృష్ణన్ అన్నారు. ఆయనతో పాటు మరికొందరు భారత సంతతి బ్రిటీషర్లు మానసిక వైద్య నిపుణుడు దినేష్ కుమార్ మఖన్‌లై భుర్జా, యంగ్ పీపుల్ క్లబ్ స్థాపకుడు అనంత్ బరోదేకర్, కమ్యూనిటీ రైల్ టీం లీడర్ కుల్విందర్ బస్సి తదితరులు నైట్‌హుడ్ జాబితాలో ఉన్నారు. మరో ఇద్దరు విదేశీ సంతతి వాళ్లు బ్రిటన్ ప్రభుత్వ నైట్ హుడ్ సత్కార జాబితాలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+